1 పైసా తగ్గింపు ..దీన్ని కూడా తగ్గింపు అంటారా?

news18
Updated: June 11, 2018, 6:41 PM IST
1 పైసా తగ్గింపు ..దీన్ని కూడా తగ్గింపు అంటారా?
  • News18
  • Last Updated: June 11, 2018, 6:41 PM IST
  • Share this:
కర్ణాటక ఎన్నికల తరువాత రోజు పెరిగిపోతూ వస్తున్న పెట్రోల్  ధర  ఒక్కసారే  60 పైసలు  తగ్గయించారనే  సంతోషపడే లోపులోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్ ధర తగ్గింది 60 పైసలు కాదు  1 పైసా  అని పేర్కొంది.

బుధవారం నాటి ఆయిల్ రేట్స్ సమీక్ష తరువాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కి 60 పైసలు, ముంబైలో పెట్రోల్ ధర లీటర్‌కి 59 పైసలు తగ్గినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే ఢిల్లీలో డీజిల్ ధర లీటర్‌కి 56 పైసలు, ముంబైలో డీజిల్ ధర లీటర్‌కి 59 పైసలు తగ్గినట్టుగా ఐఓసీఎల్ స్పష్టంచేసింది. రోజు రోజుకు అంతకంతకు పెరిగిపోతున్న ధరల్లో కొంచెం తగ్గే సరికి వాహనదారులకు కొంత రిలీఫ్ వచ్చింది. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు .. ఎందుకంటే పెట్రోల్ ధర తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే.

పెట్రోల్ ధరల సమీక్ష అనంతరం ధరలని ప్రకటించడంలో పొరపాటు జరిగిందని ఐఓసీఎల్ ప్రకటించింది. పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గితే, 60 పైసలు తగ్గినట్టుగా వెబ్ సైట్ లో పొరపాటుగా పోస్ట్ చేసినట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గడం, రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరగడంతో ధర తగ్గించారని తెలుస్తుంది. మరో వైపు ఇంధన సరఫరాపై విధించిన ఆంక్షలను తొలగించి, సరఫరాను పెంచుతామని రష్యా చెప్పడంతో, అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి.

మరోపక్క ఇలా ఒక్క పైసా తగ్గిచడంపై సామాన్యప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెంచేటప్పుడు భారీగా పెంచే ఆయిల్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఇలా 1 పైసా తగ్గించడంపై అన్ని వైపుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క పైసా తగ్గింపు కూడా తగ్గింపు అంటారా అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఒక్క పైసా తగ్గింపు పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ.. డియర్‌ మోదీ అంటూ ఓ ట్వీట్ చేసి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. 'ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్క పైసా తగ్గించారు. ఇది మోదీ ఐడియానే అయితే, అది చిన్న పిల్లల ఆలోచనలా, ఏ మాత్రం పరిణితి లేని చర్యలా ఉంది' అని రాహుల్‌ పేర్కొన్నారు.
Published by: Sunil Kumar Jammula
First published: May 30, 2018, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading