హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dry Shampoos: డ్రై షాంపూ అంటే ఏంటి..? డవ్, ఇతర ఏరోసోల్ డ్రై షాంపూలను కంపెనీలు ఎందుకు రీకాల్ చేస్తున్నాయి?

Dry Shampoos: డ్రై షాంపూ అంటే ఏంటి..? డవ్, ఇతర ఏరోసోల్ డ్రై షాంపూలను కంపెనీలు ఎందుకు రీకాల్ చేస్తున్నాయి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏరోసోల్ డ్రై షాంపూలు క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ అనే రసాయనంతో కలుషితం అయ్యాయని వెల్లడించింది. అనంతరం కస్టమర్ల శ్రేయస్సు మేరకు డవ్‌ సహా ప్రముఖ బ్రాండ్ల ఏరోసోల్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యూనిలీవర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ (Unilever Plc) కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన ఏరోసోల్ డ్రై షాంపూలు క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ అనే రసాయనంతో కలుషితం అయ్యాయని వెల్లడించింది. అనంతరం కస్టమర్ల శ్రేయస్సు మేరకు డవ్‌ సహా ప్రముఖ బ్రాండ్ల ఏరోసోల్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది. వెనక్కి తీసుకుంటున్న ఈ షాంపూలలో Nexxus, Suave, Tresemmé, Tigi వంటి బ్రాండ్‌లు కూడా ఉండటం గమనార్హం. ఈ బ్రాండ్స్‌కి సంబంధించిన డ్రై షాంపూలను కొద్దిరోజులపాటు ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 2021, అక్టోబర్ నెలకు ముందు కంపెనీ ఈ డ్రై షాంపూలను ప్రొడ్యూస్ చేసింది. కాగా ఇటీవల వీటిలో క్యాన్సర్ వ్యాధికి దారి తీసే బెంజీన్ కెమికల్ ఉన్నట్లు గుర్తించి.. వెంటనే ప్రొడక్ట్స్‌ను రీకాల్ చేసింది.

రీకాల్‌కు కారణం ప్రొడక్ట్స్‌లో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉండటమే అని కంపెనీ ప్రకటన చేసింది. బెంజీన్ లెవెల్స్ అధిక స్థాయిలో ఎక్కువ కాలం విడుదలయితే అది క్యాన్సర్‌కి దారి తీయవచ్చు. కాగా తన ఉత్పత్తులలో కనిపించే బెంజీన్ మొత్తాన్ని కంపెనీ తెలియజేయలేదు. కానీ వాటిని చాలా జాగ్రత్తగా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.

* డ్రై షాంపూ అంటే..?

డ్రై షాంపూ (Dry Shampoo) అనేది పొడి లేదా స్ప్రే రూపంలో ఉండే ఒక ప్రొడక్ట్. జుట్టును నీటిలో తడపాల్సిన అవసరం లేకుండానే ఈ డ్రై షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. జుట్టు నుంచి జిడ్డు, ఆయిల్ పోగొట్టేందుకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొన్ని డ్రై షాంపూలలో ఏరోసోల్ స్ప్రే ఉంటే.. మరికొన్నిటిలో టింటెడ్ పౌడర్‌ ఉంటుంది.

* డ్రై షాంపూ ప్రమాదకరమా..?

బెంజీన్ కెమికల్ అనేది రంగులేని లేదా లేత పసుపు రంగు ద్రవం. ఇది ఓ క్యాన్సర్ కారకమని తేలింది. బెంజీన్‌ నోటి లేదా చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తే అది ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బెంజీన్‌ వల్ల లుకేమియా, బోన్‌ మారో క్యాన్సర్, ప్రాణాంతకమైన రక్త వ్యాధులతో సహా రకరకాల స్కిన్ క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ షాంపూని రోజూ ఉపయోగించకూడదు. డ్రై షాంపూని ఎక్కువగా వాడటం వల్ల జుట్టు చిట్లిపోతుంది, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ప్రజలు ఈ ఏరోసోల్ డ్రై షాంపూ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మానేయాలని యూనిలీవర్ కంపెనీ సూచించింది. ఆ ప్రొడక్ట్స్ ఏవో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Income Tax Returns: వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఐటీ రిటర్న్స్ గడువు పెంపు.. ఎలాంటి జరిమానా లేకుండానే..

Aadhaar Complaints: మీ ఆధార్‌లో ఏవైనా సమస్యలున్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

* బెంజీన్ అధికంగా ఉన్న డ్రై షాంపూలు..

డోవ్ డ్రై షాంపూ వాల్యూమ్ & ఫుల్‌నెస్, డోవ్ డ్రై షాంపూ ఫ్రెష్ కోకోనట్, డవ్ డ్రై షాంపూ ఫ్రెష్ అండ్ ఫ్లోరల్, డోవ్ డ్రై షాంపూ అల్ట్రా క్లీన్, డోవ్ డ్రై షాంపూ ఇన్విజిబుల్, డోవ్ డ్రై షాంపూ డిటాక్స్ అండ్ ప్యూరిఫై, డోవ్ డ్రై షాంపూ క్లారిఫైయింగ్ డి, డోవ్ డ్రై షాంపూ క్లారిఫైయింగ్ చార్‌కోల్, డోవ్ డ్రై షాంపూ గో యాక్టివ్, Nexxus డ్రై షాంపూ రిఫ్రెషింగ్ మిస్ట్, Nexxus ఇనర్జీ ఫోమ్ షాంపూ, సువేవ్ డ్రై షాంపూ హెయిర్ రిఫ్రెషర్, సువేవ్ ప్రొఫెషనల్స్ డ్రై షాంపూ రిఫ్రెష్ అండ్ రివైవ్, ట్రెసెమ్మ్ డ్రై షాంపూ వాల్యూమైజింగ్, ట్రెసెమ్మ్ డ్రై షాంపూ ఫ్రెష్ అండ్ క్లీన్, బి హ్రీమ్యాడ్ బీ షాంపూ ప్రో, బెడ్ హెడ్ ఓహ్ బీ హైవ్ వాల్యూమైజింగ్ డ్రై షాంపూ, బెడ్ హెడ్ డర్టీ సీక్రెట్ డ్రై షాంపూ, బెడ్ హెడ్ రాకాహోలిక్ డర్టీ సీక్రెట్ డ్రై షాంపూ.

First published:

Tags: Business, Cancer

ఉత్తమ కథలు