Finserv MARKETS: అనిశ్చితిలో అండగా నిలిచే బ‌జాజ్​ ఎఫ్‌డీ.. వడ్డీ, ప్రయోజనాలను పరిశీలించండి

ఫ్రతీకాత్మకచిత్రం

కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌న జీవితాల‌ను అనిశ్చితిలోకి నెట్టేసింది. బ‌తుకుబండిని మొరాయించేలా చేసింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా వ‌ల‌న అనేక‌

  • Share this:
Finserv MARKETS: అనిశ్చితిలో అండగా నిలిచే బ‌జాజ్​ ఎఫ్‌డీ.. వడ్డీ, ప్రయోజనాలను పరిశీలించండి
కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌న జీవితాల‌ను అనిశ్చితిలోకి నెట్టేసింది. బ‌తుకుబండిని మొరాయించేలా చేసింది. ఏడాదిన్న‌ర‌గా క‌రోనా వ‌ల‌న అనేక‌పాఠాలు, గుణ‌పాఠాలు నేర్చుకుంటోంది ప్ర‌పంచం. చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అనేక కంపెనీలు త‌మ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌లో ఆర్థిక భ‌రోసా లేని జీవితాలు అత‌లాకుత‌ల‌మైపోయాయి.

ఈ అనిశ్చితి నేప‌థ్యంలో పొదుపు విష‌యంలో పూర్వ‌పు ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డ‌మే మేలుగా క‌నిపిస్తోంది. కొద్దిగా పొదుపు చేసుకుంటే ఆర్థిక భ‌రోసాతో నిశ్చింతగా ఉండ‌వ‌చ్చు. ఎప్పుడు ఏ ఉప‌ద్ర‌వం వ‌చ్చినా కాస్త త‌ట్టుకుని నిల‌బ‌డ‌టానికి వీలుగా ఉండేవి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఇటీవ‌ల కాలంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌పై కోత విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్య‌క్తుల‌నే కాదు, దేశాల‌కు దేశాల‌నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కోవిడ్ మ‌హ‌మ్మారిలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లే స‌రైన పొదుపు మార్గ‌మ‌ని నిపుణులు చెపుతున్నారు. గ‌త ఏడాదిన్న‌ర‌గా ఎన్నో కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇలాంటి సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డానికి ప్ర‌తివారికి ఎంతో కొంత ఆర్థిక వెన్నుద‌న్ను ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ లాంటి అనిశ్చిత ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి త‌గినంత పొదుపు మ‌దుపు చేయ‌డం ఎంతో అవ‌స‌రం.

బ్యాక్ అప్ ప్లాన్ ఉండాలి
కోవిడ్‌లాంటి సంక్షోభాల‌ను, అనిశ్చితిని ఎదుర్కోనేందుకు క్ర‌మం త‌ప్ప‌కుండా డ‌బ్బును పొదుపుచేయ‌డం, పెట్టుబ‌డి పెట్ట‌డం చేస్తుండాలి. ఇందుకోసం మార్కెట్‌లో అనేక ర‌కాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి ఏదో ఒక‌టి ఎంచుకోవ‌చ్చు. ప్ర‌తి వ్య‌క్తికి త‌ను చేయ‌బోయే పొదుపు, పెట్టుబ‌డికి సంబంధించి నిర్దుష్ట‌మైన అభిప్రాయాలు ఉంటాయి. ఇదివారి వారి జీతం, పెట్టుబ‌డులకు ఎంత మొత్తం కేటాయించ‌గ‌ల‌రు, ఎంత రిస్క్ ను భ‌రించ‌గ‌ల‌రు అనే అంశాల ఆధారంగా ఉంటుంది. మార్కెట్‌లో ల‌భ్యమ‌య్యే పెట్టుబ‌డి ప‌థ‌కాల‌లో పిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత సుర‌క్షిత‌మైన ప‌థ్ధ‌తి. మ‌న ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను విశ్వ‌సించ‌డం సంప్ర‌దాయబ‌ద్ధంగా వ‌స్తోంది. ఎందుకంటే మార్కెట్ ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా దీనిపై వ‌డ్డీరేటు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది... దీనికితోడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో అస‌లు రిస్క్‌లేక‌పోవ‌డం కూడా ఒక కార‌ణం. మీరు ఎన్ని ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టినా మీకు న‌మ్మ‌ద‌గిన నేస్తంగా, మీకు భ‌రోసా ఇచ్చేదిగా ఫిక్స్డ్ డిపాజిట్లు నిలుస్తాయ‌న‌డంతో సందేహం లేదు. మ‌న‌క‌ళ్ళెదురుగా మ‌న పెట్టుబ‌డి క‌నిపిస్తుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని ర‌ద్దు చేసుకోవ‌చ్చు. లేదా అత్య‌వ‌స‌ర‌ము అనుకుంటే ఇదే డిపాజిట్టుపై అప్పూ తీసుకోవ‌చ్చు.

బెస్ట్ ఎఫ్​డీ రేట్లు ఎవ‌రిస్తున్నారు?
గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆర్‌బీఐ రెపో రేట్ల‌లో కోత విధించ‌డం, ద్ర‌వ్య‌ల‌భ్య‌త పెర‌గ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ఎఫ్‌డీల‌పై బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల‌లో కూడా ఫిన్‌స‌ర్వ్ మార్కెట్ ద్వారా బ‌జాజ్ ఫైనాన్స్ లో మ‌దుపు చేసే ఎఫ్‌డీల‌పై ఏడాదికి 6.75శాతం దాకా వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ వ‌డ్డీరేటు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న‌ప్ప‌టికీ 12 నెలల నుండి 60 నెలల వరకు వివిధ కాల వ్యవధుల పెట్టుబడుల‌తో పాటు బహుళ వడ్డీ చెల్లింపు ఎంపికలు - నిర్ణీత కాల‌వ్య‌వ‌ధుల‌లో చెల్లించే వ‌డ్డీల‌తో - బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీల‌లో మీరు ఆన్‌లైన్‌లో ఎక్క‌డి నుంచైనా పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసేవారికి 0.10శాతం అద‌న‌పు వ‌డ్డీని కూడా అందిస్తోంది. అలాగే సీనియ‌ర్ సిటీజ‌న్ల‌కు కూడా అద‌నంగా 0.25 వ‌డ్డీ ల‌భిస్తుంది. బ‌జాజ్ ఫైనాన్స్‌లో మీరు చేసే ఎఫ్‌డీల‌పై వ‌చ్చే వ‌డ్డీల‌ను, మెచ్యూరిటీ వేళ‌కు ఎంత మొత్తం ల‌భిస్తుంది అనే విష‌యాల‌ను లెక్కించుకోవ‌డానికి ఫిన్‌స‌ర్వ్ మార్కెట్స్లో కాలికులేట‌ర్ ఆప్ష‌న్ కూడా ఉంది.
ఎఫ్‌డీలు వేయాల‌నుకునేవారు బ‌జాజ్ ఫైనాన్స్ ఆఫీసుల‌కు వెళ్ళ‌డం అక్క‌డి డాక్యుమెంటేష‌న్లు త‌దిత‌ర ప్రొసిజ‌ర్స్ గురించి అస‌లు చింత ప‌డ‌క్క‌ర‌లేదు. ఎందుకంటే ఆన్‌లైన్లో తేలిక‌గా ఎఫ్‌డీల‌ను వేసే ప‌ద్ధ‌తిని ఫిన్‌స‌ర్వ్ మార్కెట్స్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, సంబంధిత పత్రాల‌ను స‌మ‌ర్పించాక‌, హ్యాపీగా మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎకౌంట్‌ను ఈజీగా ట్రాక్ చేసుకోవ‌చ్చు.

ఇందుకోసం మీరీ తేలిక‌పాటి ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించండి...
1. ఫిన్‌స‌ర్వ్ మార్కెట్స్ వెబ్‌సైట్లోకి లాగిన్ అవ‌డం, లేదా ఫిన్ స‌ర్వ్ మార్కెట్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం...
2. మీరు ఎంత‌మొత్తానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌ద‌లుచుకున్నారు... మీ డిపాజిట్ ల‌బ్ధిదారులు ఎవ‌రు, కాల‌వ్య‌వ‌ధి, ఏ ప‌థ‌కాన్ని ఎంచుకుంటున్నారు త‌దిత‌ర వివ‌రాల‌తో ద‌ర‌ఖాస్తును నింప‌డం...
3. బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి ఖాతాను తెర‌వ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌న్నింటినీ అప్‌లోడ్ చేయ‌డం.
4. ద‌ర‌ఖాస్తు, డాక్యుమెంటేష‌న్ ప్రాసెస్ పూర్త‌య్యాక ఎఫ్‌డీ మొత్తాన్ని చెల్లిస్తే బ‌జాజ్ ఫైనాన్స్‌లో మీ ఎఫ్‌డీ ప్రాసెస్ కంప్లీట్ అయిన‌ట్టు లెక్క‌.
5. 24×7 ట్రాకింగ్ స‌దుపాయం
దీని ద్వారా మీ ఎఫ్‌డీ మొత్తంపై వ‌చ్చే రాబ‌డిని ట్రాక్ చేసుకోవ‌చ్చు.
బ‌జాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీల‌లో చేసే పెట్టుబ‌డి పై వ‌చ్చే రాబ‌డి మార్కెట్ హెచ్చు త‌గ్గుల‌తో నిమిత్తం లేకుండా వ‌స్తుంది.
సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల‌కు ఫిన్‌స‌ర్వ్ మార్కెట్స్ ఒక రాచ‌బాట‌. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం... మీ బ‌జాజ్ ఎఫ్‌డీల‌ను
ఫిన్‌స‌ర్వ్ మార్కెట్స్ ద్వారా బుక్ చేసుకోండి... చ‌క్క‌ని రాబ‌డి పొందండి.. ఆర్థిక అత్య‌వ‌స‌ర‌వేళ‌ల్లో నిశ్చింతగా ఉండండి..

ఇది క్లిక్ చేసి చూడండి..
Published by:Krishna Adithya
First published: