హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు తగ్గించిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు తగ్గించిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్

కరోనా తరువాత ఇన్సూరెన్స్ పాలసీల విలువను ప్రజలు గ్రహించారు. ముఖ్యంగా టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు ఇటీవల భారీగా పెరిగాయి. అనుకోని ప్రమాదాల కారణంగా సంపాదించే వ్యక్తి చనిపోతే, అతడి కుటుంబానికి లైఫ్ పాలసీలు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. అయితే చాలామంది ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించే పాలసీలను ఎంచుకుంటారు.

కరోనా తరువాత ఇన్సూరెన్స్ పాలసీల విలువను ప్రజలు గ్రహించారు. ముఖ్యంగా టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు ఇటీవల భారీగా పెరిగాయి. అనుకోని ప్రమాదాల కారణంగా సంపాదించే వ్యక్తి చనిపోతే, అతడి కుటుంబానికి లైఫ్ పాలసీలు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. అయితే చాలామంది ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించే పాలసీలను ఎంచుకుంటారు.

Term Insurance | మీరు టర్మ్ ఇన్స్యూరెన్స్ (Term Insurance) పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌(ABSLI) టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రీమియంను భారీగా తగ్గించింది.

టర్మ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ తీసుకుంటే.. వ్యక్తి మరణించిన తర్వాత అతని పేరుపై ఉండే ఈ బీమా ప్రయోజనాలు కుటుంబ సభ్యులకు అందజేస్తారు. కరోనా తరువాత చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్‌ (Term Insurance) పాలసీ ప్రీమియం రేట్లను మారుస్తున్నట్లు ప్రకటించింది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌(ABSLI). ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. 'ABSLI డిజిషీల్డ్ ప్లాన్' రేటును 15 శాతం వరకు తగ్గించింది. దీంతో ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో అత్యంత పోటీతత్వ ఆఫర్లలో ఒకటిగా ఇది నిలిచింది.

ఈ పథకం వినియోగదారులకు మరింత రక్షణ కల్పిస్తుంది. ప్రతి కస్టమర్ నిర్దిష్ట రక్షణ అవసరాలకు తగినట్లుగా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ సంప్రదాయ బీమా పథకానికి భిన్నంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కీమ్‌లో సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్ ద్వారా 60 ఏళ్ల నుంచి ఆదాయాన్ని(Recurring income) పొందవచ్చు. అంతేకాకుండా ముందుగా నిర్వచించిన పదవీ విరమణ వయస్సులో బీమా మొత్తాన్ని తగ్గించి ప్రత్యేక రేంజ్ ఫ్లెక్సిబిలిటీతో వస్తుంది. వినియోగదారుల లయబిలిటీలను వారి లైఫ్ స్టేజ్‌కు అనుగుణంగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్ కవర్ చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

ESIC: ఈఎస్ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ బెనిఫిట్ పొందండి ఇలా

ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్.. కస్టమర్ జీవితంలోని విభిన్న రక్షణ అవసరాలను తీర్చగలదని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్కొంది. మల్టిపుల్ ప్లాన్ ఆప్షన్లు అయిన జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్, క్రిటికల్ ఇల్నెస్ లాంటి ప్రణాళికలను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయోజనాలు మీకిష్టమైన వారికి కూడా కవర్ చేయవచ్చు. ఈ నూతన ధరల తగ్గింపుతో ఈ ప్లాన్ కస్టమర్లకు వివిధ చెల్లింపు నిబంధనలు, పాలసీ కాలపరిమితి, మరణ ప్రయోజన చెల్లింపు ఆప్షన్లను అందిస్తుంది.

PAN Aadhaar Link: పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయలేదా? కొత్త వెబ్‌సైట్‌లో చేయండి ఇలా

ఊహించిన దానికంటే కరోనా ఎక్కువ రోజుల పాటు కొనసాగినందువల్ల ప్రజలు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కమలేష్ రావు అన్నారు. టర్మ్ ప్లాన్స్ కు డిమాండ్ పెరగడంతో, వినియోగాదారుని ద్రవ్య అవసరాలకు అనుగుణంగా ఏబీఎస్ఎల్ఐ డిజిషీల్డ్ ప్లాన్ ప్రీమియం రేటు తగ్గించామని తెలిపారు. దీని ద్వారా మీకిష్టమైన వారికి ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చని, తగ్గిన ప్రీమియం ధరను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance