ఈ రోజుల్లో అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో(Hospital) చేరడమంటే రూ.లక్షల్లో వ్యవహారంగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) మనకు ఒక రకమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఊహించని ఖర్చుల నుంచి ఇది రక్షణ అందిస్తుంది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు విదేశాల్లో వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవ్వొచ్చు. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని 16 ప్రధాన అనారోగ్యాలకు విదేశాల్లో చికిత్స తీసుకున్నా కవరయ్యేలా 3 ఇన్ 1 సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్. ‘Activ Health Platinum Premiere Plan’ పేరుతో Aditya Birla Health Insurance ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టింది.
పాలసీదారు ఆరోగ్య అవసరాల కోసం భారత్, విదేశాల్లో చికిత్స అందించేందుకు ఇండెమ్నినిటీ, ఫిక్స్డ్ బెనిఫిట్ వంటి రెండు ప్రయోజనాలను ఇది అందిస్తుంది.
ఈ ప్లాటినం ప్రీమియర్ పాలసీ కింద ఇన్-పేషెంట్, హాస్పిటలైజేషన్ అనంతర ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్త కవరేజ్ లభిస్తుంది. ఇందులో ట్రావెల్, అకామడేషన్ ఖర్చులు, వీసా సహాయ సేవలు అంతర్గతంగా ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. అత్యాధునిక సైబర్ నైఫ్ రొబోటిక్ ఆపరేషన్లు, లేజర్ థెరపీ, బారియాట్రిక్ సర్జరీ వంటివన్నీ ఈ ప్లాన్‌లో కవర్ అవుతాయి.
ప్రత్యేకమైన, మెరుగైన చికిత్సల కోసం చాలా మంది విదేశాలకు ప్రయాణం చేస్తున్నారు. అలాంటి చికిత్సల కోసం చాలా మంది దీని కోసం విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని Activ Health Platinum Premiere Plan ప్రవేశపెట్టామని తెలిపారు Aditya Birla Health Insurance సీఈఓ మయాంక్ భట్వాల్.
ప్లాన్ ఫీచర్లు, బెనిఫిట్స్
హెల్త్ రిటర్న్స్ - పాలసీదారులు ఆరోగ్యంగా ఉంటూ ప్రీమియంలో 100 శాతం వరకు రిటర్న్స్‌గా పొందవచ్చు.
సూపర్ రీలోడ్ – అదే వ్యాధి లేదా ఇతర వ్యాధుల కోసం అన్లిమిటెడ్ రీలోడ్ అందుబాటులో ఉంది.
క్యుములేటివ్ బోనస్ – ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో 50 శాతం వరకు, గరిష్టంగా 100 శాతం వరకు, (గరిష్ఠంగా రూ.1 కోటి వరకు) క్యుములేటివ్ బోనస్ ఉంటుంది.
పెద్ద జబ్బులపై అంతర్జాతీయ కవరేజ్ – జాబితాలోని 16 ప్రధాన వ్యాధులకు ముందుగా నిర్ణయించుకున్న ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ కోసం క్యాష్‌లెస్ సేవలు పొందవచ్చు.
ఎక్స్పర్ట్ హెల్త్ కోచ్ – వైద్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్య, ఫిట్నెస్, మెంటల్ కోచింగ్ సెషన్, హోమియోపతి టెలికన్సల్టేషన్ సేవలు..
క్రానిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ – ఈ పాలసీ తీసుకున్న తర్వాత తీవ్రమైన పరిస్థితి తలెత్తితే ఇది ఆటోమ్యాటిక్‌గా క్రానిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌గా అప్‌గ్రేడ్ అవుతుంది.
విదేశాల్లో క్యాష్‌లెస్ వైద్య చికిత్స కోసం రూ.3 కోట్లు, జాబితాలోని 16 ప్రధాన వ్యాధులకు రూ.6 కోట్ల వరకు బీమా మొత్తాన్ని ఈ ప్లాన్ అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.