Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 100 శాతం వెనక్కి ఇస్తున్న కంపెనీ... పాలసీ వివరాలివే

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 100 శాతం వెనక్కి ఇస్తున్న కంపెనీ... పాలసీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Aditya Birla Health Activ Health insurance policy | ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ యాక్టీవ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని ప్రారంభించింది. 100 శాతం వరకు ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీ ఇది.

  • Share this:
    హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాలి. ఆ ప్రీమియంపై ఎలాంటి రిటర్న్స్ ఉండవు. పాలసీ తీసుకున్నవాళ్లు అనారోగ్యం బారినపడితే ఆస్పత్రి ఖర్చులు లేకుండా చికిత్స పొందేందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రీమియం చెల్లించినందుకు లాభాలు ఉండవు. ఇలా ఎన్నేళ్లు ప్రీమియం చెల్లించినా అంతే. కాకపోతే పాలసీ కవర్‌కు సంబంధించిన లాభాలు ఉంటాయి. కానీ మొదటిసారిగా 100 శాతం వరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం వెనక్కి ఇస్తామంటూ సరికొత్త పాలసీని ప్రకటించింది ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఆరోగ్య బీమా రంగంలో 100 శాతం వరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రిటర్న్స్ ప్రకటించిన తొలి కంపెనీ ఇదే. Activ Health పేరుతో ఈ పాలసీని ప్రకటించింది. 100 శాతం రిటర్న్స్‌ను వైద్య ఖర్చుల కోసం అంటే మెడిసిన్ కొనడం, డయాగ్నస్టిక్ టెస్టులు చేయించుకోవడం, డే కేర్ ట్రీట్మెంట్, ఔట్ పేషెంట్ ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

    ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తున్న యాక్టీవ్ హెల్త్ పాలసీలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కవర్ అవుతుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ హోమియోపతి టెలీమెడిసిన్ కూడా కవర్ అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలబారిన పడితే ఎలాంటి ఖర్చు లేకుండా ఆటోమెటిక్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఆస్తమా, హైబీపీ, హై కొలస్ట్రాల్, డయాబెటిస్ లాంటివాటికి డే1 కవర్ ఉంటుంది. దీంతో పాటు ఓపీడీ బెనిఫిట్స్, డాక్టర్ కన్సల్టేషన్, గైడెన్స్ లాంటివి ఉంటాయి. మెడికల్, న్యూట్రీషియనల్, మెంటల్ అండ్ ఫిట్‌నెస్, మెంటల్ కౌన్సిలింగ్ సెషన్, హోమియోపతి టెలీకన్సల్టేషన్ లాంటివన్నీ కవర్ అవుతాయి.


    Bank Holidays in March 2021: మార్చిలో బ్యాంకులకు 8 సెలవులు... 2 రోజుల సమ్మె... ఎప్పుడెప్పుడంటే

    Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్ చివరి సిరీస్ ధర ఫిక్స్ చేసిన ఆర్‌బీఐ... ఒక గ్రాము ఎంతంటే

    హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 100 శాతం వెనక్కి తీసుకోవడానికి నియమనిబంధనలు ఉంటాయి. రెండేళ్లు క్లెయిమ్ చేయకపోతే సమ్ ఇన్స్యూర్డ్ రెట్టింపు అవుతుంది. క్లెయిమ్ చేయని ఏడాది 50 శాతం నో క్లెయిమ్ బోనస్ పొందొచ్చు. సమ్ ఇన్స్యూర్డ్‌లో గరిష్టంగా 100 శాతం వరకు ఇది వర్తిస్తుంది. ఇక Activ Health యాప్‌లోని వర్కవుట్ వీడియోల ద్వారా వర్కవుట్స్ చేసేవారికి హెల్త్ రిటర్న్స్ వస్తాయి.

    Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగించారా? తెలుసుకోండి ఇలా

    Milk Price: మార్చి 1 నుంచి పాల ధరలు పెరిగే ఛాన్స్... ఎందుకంటే

    మరోవైపు మరో ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఫ్యూచర్ జనరలీ కూడా ఇటీవల ఇలాంటి ప్రొడక్ట్ లాంఛ్ చేసింది. ముందటి ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే ప్రీమియంలో 80 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
    Published by:Santhosh Kumar S
    First published: