Home /News /business /

Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం

Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం

Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం
(ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance: సీనియర్ సిటిజన్లకు మొదటి రోజు నుంచే కవరేజ్... ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త పథకం (ప్రతీకాత్మక చిత్రం)

Aditya Birla Activ Health Essential policy | ఆదిత్య బిర్లా నుంచి వృద్ధులకు కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ (Health Insurance) పాలసీ వచ్చింది. ఈ పాలసీలో మొదటి రోజు నుంచే కవరేజీ ప్రారంభం అవుతుంది.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాంటి వారి కోసమే ఆదిత్య బిర్లా హెల్త్ కంపెనీ ఓ కొత్త హెల్త్ ప్లాన్ తీసుకువచ్చింది. యాక్టివ్ హెల్త్ ఎసెన్షియల్ ప్లాన్ (Activ Health Essential plan) పేరుతో ఈ కొత్త ఆరోగ్య బీమా పాలసీ ప్రారంభమైంది. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ బీమా చేసిన మొదటి రోజు నుంచే దీర్ఘకాలిక రోగాలకు ఇన్స్యూరెన్స్ కవరేజీ అందిస్తుంది. ఆప్షనల్ ప్రయోజనాలు అందించడానికి కో-పేమెంట్ తప్పని సరికాదు. సీనియర్ సిటిజన్లకు కౌన్సిలింగ్ సపోర్ట్, హెల్త్ కోచింగ్ సదుపాయాలు కూడా అందిస్తోంది.

పాలసీదారులకు మొదటి రోజు నుంచి ఈ ప్లాన్ సమగ్ర బీమా కవరేజీ అందిస్తుంది. పాలసీ తీసుకునేప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితితో పాటు తరువాత దశలో అదనపు ఖర్చు లేకుండా బీమా కవర్ చేస్తారు. అదనపు ప్రీమియం చెల్లిస్తే 20 శాతం కో-పేమెంట్ తీసివేస్తామని కంపెనీ తెలిపింది. మానసిక అనారోగ్యాలు, ఇంటి వద్ద చికిత్స పొందేందుకు కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

LIC Premium: ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవా? ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్

‘కోవిడ్ మహమ్మారి ఆరోగ్య సంరక్షణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. 26 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోవడం వల్ల వృద్ధులు భారంగా మారుతున్నారని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వైద్య ఖర్చులపై సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల కూడా కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ప్రారంభించాం’ అని తెలిపారు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABHICL) CEO మయాంక్ బత్వాల్.

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌తో రిస్క్ లేకుండా లక్షాధికారి కావొచ్చు... పొదుపు చేయండి ఇలా

యాక్టివ్ ప్లాటినమ్ ఎసెన్సియల్ ప్లాన్ ఫీచర్లు


మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే కవరేజీ లభిస్తుంది

పాలసీదారుల ఆరోగ్య పరిరక్షణలో సలహాలు ఇవ్వడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు

ప్రీమియంలో 50 శాతాన్ని హెల్త్ రివార్డ్ పాయింట్ల రూపంలో అందిస్తారు

కో పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది

9000 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ కవరేజీ అందిస్తారు

ఆసుపత్రిలో చేరే 30 రోజుల ముందు వరకు అయిన ఆరోగ్య ఖర్చులు, ఆసుపత్రిలో చేరిన 60 రోజుల వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది

ఆయుష్ కవర్, ఊబకాయానికి చికిత్స, ఆధునిక వైద్య చికిత్సలకు కవరేజీ అందిస్తోంది

24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని 586 జబ్బులకు డే- కేర్ కవర్ వర్తిస్తుంది

ఇంటి వద్దే నగదు రహిత చికిత్సకు కవరేజీ అందిస్తుంది

సీనియర్ సిటిజన్లకు దీర్ఘకాలిక ఆరోగ్య కవరేజీతోపాటు, వారి పర్యవేక్షణ, వారిని గైడ్ చేయడం కోసం నిపుణులైన డాక్టర్లు సలహాలు అందిస్తారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Health Insurance, Insurance, Personal Finance

తదుపరి వార్తలు