Reliance Retail-Adia Deal: రిలయన్స్ రిటైల్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ భారీ పెట్టుబడి...

(credit - twitter)

రిలయన్స్ రిటైల్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (Abu Dhabi Investment Authority (ADIA) 1.2 శాతం వాటా కోసం రూ.5,512.50 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.

 • Share this:
  రిలయన్స్ రిటైల్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (Abu Dhabi Investment Authority (ADIA) 1.2 శాతం వాటా కోసం రూ.5,512.50 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడితో, రిలయన్స్ రిటైల్ ప్రముఖ ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు అయిన సిల్వర్ లేక్, కెకెఆర్, జనరల్ అట్లాంటిక్, ముబదలా, జిఐసి, టిపిజి మరియు ఎడిఐఐ నుండి నాలుగు వారాలలో రూ.37,710 కోట్లు సమీకరించింది. ఈ పెట్టుబడితో Reliance Retail Ventures Ltd (RRVL) ప్రీ మనీ ఈక్విటీ విలువ రూ. 4.285 లక్షల కోట్లకు చేరుకుంది.

  ఈ పెట్టుబడి ప్రస్తుత రెగ్యులేటరీ నియంత్రణకు లోబడి జరగనుంది. మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ రిటైల్ ఆర్థిక సలహాదారుగా, సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్, డేవిస్ పోల్క్ & వార్డ్‌వెల్ లీగల్ సలహాదారులుగా వ్యవహరించారు.

  ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, "ADIA పెట్టుబడితో, నిరంతర మద్దతుతో మేము సంతోషిస్తున్నాయు, ప్రపంచవ్యాప్తంగా నాలుగు దశాబ్దాలకు పైగా సంపద విలువను పెంచడంలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన సంస్థ నుంచి ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నామని " పేర్కొన్నారు.

  అలాగే ADIA లోని ప్రైవేట్ ఈక్విటీల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షావన్ అల్ధహేరి మాట్లాడుతూ, "ఈ పెట్టుబడి ఆసియాలోని మార్కెట్ ప్రముఖ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనే మా వ్యూహానికి అనుగుణంగా ఉందని" పేర్కొన్నారు. అలాగే భారత దేశంలోని వినియోగితను ముందుండి నడిపించడంలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
  Published by:Krishna Adithya
  First published: