హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health insurance: ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నారా?.. అయితే, ఎక్కువ కవరేజీ పొందడానికి ఇలా చేయండి

Health insurance: ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నారా?.. అయితే, ఎక్కువ కవరేజీ పొందడానికి ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేవలం కరోనా(Corona) మహమ్మారి సమయంలోనే కాదు, అన్ని సమయాల్లో ప్రతి వారికి ఆరోగ్య బీమా(Health Insurance) తప్పనిసరిగా ఉండాలి. వైద్య అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వచ్చిపడతాయో తెలియదు అందుకే ఆరోగ్య బీమా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

కేవలం కరోనా(Corona) మహమ్మారి సమయంలోనే కాదు, అన్ని సమయాల్లో ప్రతి వారికి ఆరోగ్య బీమా(Health Insurance) తప్పనిసరిగా ఉండాలి. వైద్య అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వచ్చిపడతాయో తెలియదు అందుకే ఆరోగ్య బీమా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఆరోగ్య బీమా ద్వారా అత్యుత్తమ వైద్య సదుపాయాలు పొందడమే కాదు, బీమా(Insurance) చేసిన వారి ఆర్థిక స్థితి తారుమారు కాకుండా కాపాడుతుంది. సమగ్రంగా ఆరోగ్య బీమా కవరేజీ కావాలంటే రైడర్లు తప్పనిసరి. రైడర్ లేదా యాడ్ ఆన్ ల ద్వారా అధిక ప్రయోజనలు పొందవచ్చు.

రైడర్ అంటే ఏమిటి?

ఆరోగ్య బీమా పాలసీ కవరేజీని పెంచేదే రైడర్. అయితే వివిధ రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య బీమా కవరేజీ పెంచుకోవడంతోపాటు, ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం,తీవ్రమైన అనారోగ్యాల కవరేజీ కూడా పెంచుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కవరేజీ పొందడం ద్వారా అనుకోని ప్రమాదం జరిగితేమీపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది.

ఆసుపత్రి రూం అద్దె మినహాయింపు

ఈ రైడర్ ద్వారా ఆసుపత్రి గది అద్దెకు ఎలాంటి పరిమితి లేకుండా గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చు.

Insurance Company: బీమా కంపెనీపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? ఈ ఆరు మార్గాలు తెలుసుకోండి..

ఆసుపత్రి క్యాష్ బెనిఫిట్

ఆరోగ్య బీమా పాలసీ పరిదిలోకి రాని ఖర్చులను ఈ రైడర్ ద్వారా పొందవచ్చు. వైద్య ఖర్చులు కాకుండా ఆసుపత్రిలో రోజు వారీ ఉండే ఖర్చులకు ఈ రైడర్ ఉపయోగపడుతుంది.

ప్రసూతి ఖర్చులకు ప్రత్యేక రైడర్

చాలా పాలసీలు ప్రసూతి ఖర్చులు కవర్ చేయడం లేదు.మెటర్నిటీ రైడర్ ద్వారా ప్రసూతి ఖర్చులు కవరేజీ పొందవచ్చు. అయితే రెండు నుంచి మూడు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీని ప్రయోజనాలు పొందాలంటే ముందే రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది.

Credit Cards: ఈ 5 క్రెడిట్ కార్డులతో అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్స్

తీవ్ర అనారోగ్యం కవర్ చేసే రైడర్

సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు ప్రతి ఒక్కరికి తప్పనిసరి. అయితే తీవ్ర అనారోగ్యాలను ఈ పాలసీలకు కవర్ చేయవు. అందుకే క్రిటికల్ ఇల్ నెస్ కవర్ రైడర్ తీసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనం పొందవచ్చు. గుండెపోటు, క్యాన్సర్, కిడ్నీ విఫలం కావడం, పక్షవాతం సహా అన్ని అనారోగ్యాలను ఇది కవర్ చేస్తుంది.

ప్రమాద బీమా రైడర్

క్రిటికల్ రైడర్ తరహాలోనే వ్యక్తిగతంగా ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ రైడర్ కవర్ చేస్తుంది. ప్రమాదంలో మరణించినా, పూర్తిగా లేదా పాక్షిక అంగవైకల్యం కలిగినా నామినీలకు బీమా చెల్లిస్తారు. వైద్య ఖర్చులు, ఆసుపత్రిలో చికిత్స సమయంలో కోల్పోయిన ఆదాయానికి కూడా ఇది హామీ ఇస్తుంది. ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు కూడా చెల్లిస్తుంది.

ఔట్ పేషెంట్ కవర్

చాలా పాలసీలు ఇన్ పేషెంటుగా చేరితేనే కవర్ చేస్తాయి. ఈ రైడర్ ద్వారా ఔట్ పేషెంట్లకు కూడా కవరేజీ అందిస్తుంది. ఓపీడీ కవర్ ద్వారా చిన్న చిన్న ఖర్చులు కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

వినియోగ వస్తువులకు కవర్

ఆసుపత్రిలో చేరినప్పుడు గ్లౌజులు, మాస్కులు, పీపీఈ కిట్లు, హౌస్ కీపింగ్, సర్జికల్ వస్తువుల కొనుగోలుకు అయ్యే ఖర్చులను ఈ రైడర్ ద్వారా కవరేజీ పొందవచ్చు.

నో క్లెయిమ్ బోనస్

ఈ రైడర్ ద్వారా ఏదైనా ఏడాది మీరు బీమా క్లెయిమ్ చేయకపోతే రివార్డు కింద అదనపు కవరేజీ పొందవచ్చు.

ద్రవ్యోల్భణ రక్షణ కవర్

రోజు రోజుకు పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. పెరిగే ధరలకు అనుగుణంగా బీమా కవరేజీ పెరుగుతుంది.

First published:

Tags: Health Insurance, Insurance, Life Insurance

ఉత్తమ కథలు