• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ADAR POONAWALLA SELLS HIS STAKE IN PANASIA BIOTECH FOR RS 118 CRORES AK GH

Adar Poonawalla: పనాసియా బయోటెక్​లో తన వాటా విక్రయించిన ఆదార్​ పునవల్లా​.. రూ. 118 కోట్లకు కుదిరిన డీల్​

Adar Poonawalla: పనాసియా బయోటెక్​లో తన వాటా విక్రయించిన ఆదార్​ పునవల్లా​.. రూ. 118 కోట్లకు కుదిరిన డీల్​

అదర్ పూనావాలా (Image: Facebook)

బిఎస్‌ఈ బ్లాక్ డీల్ డేటా ప్రకారం, అదర్​ పూనవల్లా తన వద్ద ఉన్న 31,57,034 స్క్రిప్ట్‌లను ఒక్కో షేరుకు రూ .373.85 చొప్పున విక్రయించారు.

  • Share this:
సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా పనాసియా బయోటెక్‌లో తన వాటా మొత్తాన్ని ఓపెన్​ మార్కెట్​లో విక్రయించారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంబంధించి పనాసియా బయోటెక్​ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ నుంచి 5.15 శాతం మేర ఉన్న తన సొంత వాటాను 118 కోట్ల రూపాయలకు విక్రయించారు. కాగా, ఈ వాటాను తాను సీఈఓగా వ్యవహరిస్తున్న సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) దక్కించుకోవడం విశేషం. బిఎస్‌ఈ బ్లాక్ డీల్ డేటా ప్రకారం, అదర్​ పూనవల్లా తన వద్ద ఉన్న 31,57,034 స్క్రిప్ట్‌లను ఒక్కో షేరుకు రూ .373.85 చొప్పున విక్రయించారు. ఈ మొత్తం డీల్ విలువ రూ .118.02 కోట్లుగా ఉంటుందని పీటీఐ కథనం పేర్కొంది. బహిరంగ మార్కెట్​లో వేలం ద్వారా ఈ షేర్లను అదే ధర వద్ద సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఐఐ) దక్కించుకున్నట్లు పీటీఐ వెల్లడించింది.

2021 మార్చి త్రైమాసికానికి సంబంధించి విడుదలైన వాటాదారుల డేటా ప్రకారం, పనాసియా బయోటెక్​లో అదార్​ పూనవల్లా, సీరం ఇన్​స్టిట్యూట్​ సంస్థ ఇద్దరూ స్టేక్​ హోల్డర్స్​గా కొనసాగుతున్నారు. పనాసియా బయోటెక్​లో పూనవల్లా 5.15 శాతం, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) 4.98 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీంతో, పునవల్లా తన సొంత వాటాను బహిరంగ మార్కెట్​లో విక్రయించగా.. అదే ధర వద్ద ఎస్​ఐఐ సదరు వాటాను సొంతం చేసుకుంది. కాగా, పనాసియా బయోటెక్​ షేర్లు సోమవారం రూ .384.9 వద్ద ముగిశాయి. అంతకుముందు ముగింపుతో పోలిస్తే ఇది 1.16 శాతం ఎక్కువని మార్కెట్​ వర్గాలు స్పష్టం చేశాయి.

రూ.118.02 కోట్లకు కుదిరిన డీల్​..
ఇదిలా ఉంటే, కోవాగ్జిన్​ డోసుల మధ్య ప్రస్తుతమున్న గ్యాప్​ను 12–16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పునవల్లా స్పందిస్తూ ‘‘ప్రస్తుతం కోవిషీల్డ్​​ టీకా డోస్​ల మధ్య ఉన్న గ్యాప్​ను 8 వారాల నుంచి 12–16 వారాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ కోణంలో చైస్తే ఇది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్యాప్​ వల్ల టీకా సామర్థ్యంతో పాటు మొదటి డోస్​ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైంది.” అని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల తమపై కాస్త ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆయన ఆశాభావ్యం వ్యక్తం చేశారు. తద్వారా, మరింత ఎక్కువ మంది ప్రజలకు మొదటి డోసు వేసేందుకు ఇది ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
First published:

అగ్ర కథనాలు