Home /News /business /

ADANI VEHICLES CO GETS APPROVAL FOR TRADEMARK ARTICLESHOW FULL DETAILS HERE GH VB

Adani Automobiles: ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి అదానీ ఎంట్రీ..? ఆ వాహనాల కోసం ట్రేడ్‌మార్క్‌ పొందినట్లు వార్తలు..

అదానీ (ఫైల్)

అదానీ (ఫైల్)

అదానీ ఇప్పుడు ఆటోమొబైల్ రంగం (automobile sector)లోకి కూడా ప్రవేశించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. భూమిపై, నీటిలో నడిచే వాహనాలకు ఉపయోగించే ‘అదానీ’ అనే ఓ ట్రేడ్‌మార్క్‌ను తాజాగా ఎస్‌బీ అదానీ ట్రస్ట్ (SB Adani Trust) పొందడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇంకా చదవండి ...
అత్యంత సంపన్నుల్లోనే సంపన్నుడిగా అదానీ గ్రూప్ (Adani group) అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) అవతరించిన విషయం తెలిసిందే. సంపద సృష్టిలో ఇంకా మరిన్ని శిఖరాలు అధిరోహించేందుకు ఆయన కొత్త వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు. మొన్నీమధ్యే ఉక్కు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసిన అదానీ ఇప్పుడు ఆటోమొబైల్ రంగం (automobile sector)లోకి కూడా ప్రవేశించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. భూమిపై, నీటిలో నడిచే వాహనాలకు ఉపయోగించే ‘అదానీ’ అనే ఓ ట్రేడ్‌మార్క్‌ను తాజాగా ఎస్‌బీ అదానీ ట్రస్ట్ (SB Adani Trust) పొందడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన ఎస్‌బీ అదానీ ట్రస్ట్ (SB Adani Trust) ఈ ట్రేడ్‌మార్క్‌ను ప్రతిపాదించింది. దీనికి అప్రూవల్ రావడంతో ఆటోమొబైల్ రంగంలో అదానీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Ambrane Earbuds: అంబ్రేన్‌ నుంచి కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్​.. 23 గంటల బ్యాటరీ బ్యాకప్​తో పాటు అదిరిపోయే ఫీచర్లు


గ్రీన్ ప్రాజెక్ట్‌లలో భాగంగా పోర్ట్స్-టు-పవర్.. ఇలా అన్ని వ్యాపారాల్లో రాణించాలనే ఉద్దేశంతోనే ఆటో మొబైల్స్ లో కూడా అదానీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలైన కోచ్‌లు, బస్సులు, ట్రక్కుల వంటి ఎలక్ట్రిక్ మొబిలిటీ/ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేస్‌లోకి ప్రవేశించాలనేది అదానీ ప్లాన్ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది ప్రారంభంలో దాని అంతర్గత అవసరాలు, విమానాశ్రయాలు, పోర్ట్‌లు, ఇతర లాజిస్టిక్స్ ప్రయోజనాల కోసం తన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తుంది. అదానీ సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Women’s Shabarimala: ఈ టెంపుల్ మహిళల శబరిమల.. ఆడవాళ్లు ఇరుముడితో వెళ్లే ఈ ఆలయం ప్రత్యేకతలివే..


ఇటీవల ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్-ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను శక్తివంతం చేసే ప్రయత్నంలో, రెవిన్యూ- షేరింగ్ ప్రాతిపదికన ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు భూమిని అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అదానీ సంస్థ గుజరాత్‌లోని ముంద్రాలోని దాని ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఎలక్ట్రిక్ మొబిలిటీలో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పోటీ ఎదురవుతుంది. దీనికి కారణం ఇవి కూడా తక్కువ కార్బన్ ప్రాజెక్టులలో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ప్రకటించాయి.

ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల్లోకి అదానీ ఎంట్రీతో మార్కెట్ షేక్ అవుతుందని ఆటో పరిశ్రమ పరిశీలకులు చెప్పారు. ప్రస్తుతం టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ ఏస్, దోస్త్ బ్రాండ్‌లతో లాస్ట్-మైల్, ఫస్ట్-మైల్ కనెక్టివిటీ సెగ్మెంట్‌ను నియంత్రిస్తున్నాయి. ప్రస్తుతం లైట్, మీడియం కార్గో క్యారియర్లు వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారిపోతున్నాయి. ఎందుకంటే e-LCV (లైట్ కమర్షియల్ వెహికల్) ప్రతి కి.మీ నిర్వహణ ఖర్చు 80 పైసలు మాత్రమే. అదే డీజిల్ వాహనమైతే ప్రతి కి.మీకి నిర్వహణ ఖర్చు రూ.4 అవుతోంది. దీనికితోడు ప్రభుత్వ, 'ఫేమ్ 2' సబ్సిడీలు కూడా మూలధన ధరను తగ్గించాయి.

HQ-17 Missile: ఆర్మీ ఆధునీకరణలో చైనా దూకుడు.. మిలిటరీ వ్యవస్థలోకి సరికొత్త మిస్సైల్.. అది ఎలా పనిచేస్తుందంటే..


ఇతర బిగ్ బ్యాంగ్ సెగ్మెంట్ బస్సులు, ప్రత్యేకించి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ ఢిల్లీ, బెంగళూరు, సూరత్, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాలకు 5,450 సింగిల్ డెక్కర్, 130 డబుల్ డెక్కర్ ఈ-బస్సుల కోసం టెండర్‌ను నిర్వహిస్తోంది. బ్యాటరీ ధరలు 12-18 నెలల్లో 100 డాలర్ల కంటే తక్కువగా పడిపోతాయని అంచనా వేయడంతో ఈవీ మార్కెట్ లో పోటీతత్వం నెలకొంటోంది.
Published by:Veera Babu
First published:

Tags: Adani group, Business, Trade

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు