Home /News /business /

ADANI FOCUSED ON ALL PORTS IN ANDHRA PRADESH NGS

Andhra Pradesh: ఏపీలో పోర్టులే టార్గెట్.. అదానీ గొడుకు కిందకు చేరడానికి మరికొన్ని రెడీ

ఏపీలో పోర్టులపై అదానీ కన్ను

ఏపీలో పోర్టులపై అదానీ కన్ను

ఆంధ్రప్రదేశ్ లో పోర్టులన్నీ అదానీ గ్రూపు కిందకు వచ్చేస్తున్నాయా? త్వరలో నిర్మించబోయే పోర్టులపైనా అదానీ సంస్థ కన్నేసిందా? ఇప్పటికే అందుకు సంబంధించిన ఒప్పందం పూర్తైందా?

    పోర్టుల రారాజుగా అదానీ కంపెనీ ఎదుగుతోంది. ముఖ్యంగా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అన్న చందంగా అదానీ గ్రూపు విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కీలక పోర్టులన్నీఅదానీ గ్రూప్ తన సొంతం చేసుకుంది. అదే జోష్ తో త్వరలో ఏపీలో నిర్మించబోతున్న మరికొన్ని పోర్టులు కూడా అదానీ గొడుకు కిందకే చేరుతున్నాయి. ఏపీపైనే అదానీ పోర్ట్స్ సంస్థ ఎందుకు ఫోకస్ చేస్తోంది. మరోవైపు అదానీ గ్రూపు విస్తరణ వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

    అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఏపీకి సొంతం. అందుకే ఇప్పుడు అదానీ కన్ను ఏపీపై పడింది. ఏపీలో సంపద సృష్టి కోసం తీర ప్రాంత అభివృద్ధికి.. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో పోర్టుల అభివృద్ధికి కేంద్ర సాయంతో రాష్ట్ర  ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. ఈ క్రమంలో అత్యంత పేరు పొందిన అదానీ గ్రూప్‌ ఏపీలోని రాబోయే పోర్టులపై కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా వాణిజ్యం చేస్తున్న అత్యంత కీలకమైన పోర్టులు కృష్ణపట్నం, గంగవరం లను అదానీ గ్రూప్‌ తమ చేతుల్లోకి తీసుకుంది. గతేడాదే కృష్ణపట్నం పోర్టులోని 75 శాతం వాటాలను కొనుగోలు చేసిన అదానీ సంస్థ. సరిగ్గా ఏడాది కూడా తిరగక ముందే పోర్టులోని మొత్తం వాటాను. అంటే మిగిలిన 25 శాతం వాటాలను కూడా తన సొంతం చేసుకుంది. విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ నుంచి కొనుగోలు చేసిన 25 శాతం వాటా విలువతో.. ప్రస్తుతం 2 వేల 800 కోట్లుగా నిర్థారించినట్టు అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్ ప్రకటించింది.

    రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ దక్కించుకునేందుకు అదానీ గ్రూప్‌ వడివడిగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా మినహా.. మిగిలిన వాటాలన్నింటిని అదానీ గ్రూప్‌ ఇటీవలే కొనుగోలు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన వాటాల బదలాయింపు ప్రక్రియ కూడా పూర్తైంది. త్వరలోనే బందరు, భావనపాడు, రామాయపట్నం వంటి పోర్టుల నిర్మాణ ప్రక్రియ కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలోనే ఏపీ మారీటైమ్‌ బోర్డు టెండర్లకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ పోర్టులను కూడా అదానీ గ్రూప్‌ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ పోర్టులపై అదానీ గ్రూప్‌ ఫోకస్‌ పెట్టడం మంచి పరిణామామే అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రంలో మంచి పట్టున్న గ్రూప్‌గా అదానీకి పేరుందని.. ఇంతటి ప్రఖ్యాత కంపెనీ రాష్ట్రాలపై కనుక దృష్టి పెడితే.. పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వస్తాయనేది ప్రభుత్వ చెబుతోంది. అయతే విపక్సాలు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్నితప్పు పడుతున్నాయి. అదికార వైసీపీ నేతలు తమ వాటల కోసమే ఇలా పోర్టులన్నీ అమ్మేస్తోందని విమర్శిస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Adani Group, Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు