Honda Activa | మీరు కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఏ స్కూటర్ (Scooter) కొనుగోలు చేయాలో తెలియడం లేదా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో ఎక్కువ మంది ఏ ఏ స్కూటర్లు కొంటున్నారో చూద్దాం. వీటిల్లో మీకు నచ్చిన స్కూటర్ ఎంచుకోవచ్చు. అక్టోబర్ నెలలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వీటిల్లో హోండా (Honda), టీవీఎస్, యమహా, సుజుకీ కంపెనీల వెహికల్స్ ఉన్నాయి.
హోండా యాక్టివా టాప్ స్థానంలో ఉంది. ఇది మళ్లీ అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. చాలా కాలం నుంచి హోండా యాక్టివానే టాప్ సెల్లింగ్ స్కూటర్‌గా కొనసాగుతూ వస్తోంది. గత నెలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. యాక్టివా అమ్మకాలు ఏకంగా 2,10,623 యూనిట్లుగా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఇతర స్కూటర్లు ఏవేవి టాప్‌లో ఉన్నాయో చూద్దాం.
టీవీఎస్ జుపిటర్ రెండో స్థానంలో ఉంది. దీని అమ్మకాలు 77,042 యూనిట్లు ఉన్నాయి. అంటే హోండాకు ఈ స్కూటర్‌కు అమ్మకాల్లో చాలా తేడా ఉంది. మూడో స్థానంలో సుజుకీ యాక్సెస్ నిలిచింది. దీని అమ్మకాలు 49,192 యూనిట్లు ఉన్నాయి. అంటే టాప్ 3 స్కూటర్లలో హోండా, టీవీఎస్, సుజుకీ మోడల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు.
కియా కార్లను ఇక తక్కువ ధరకే కొనొచ్చు.. కంపెనీ కొత్త సర్వీసులు!
తర్వాత నాలుగో స్థానంలో కూడా టీవీఎస్ ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. 31,049 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఐదో స్థానంలో హోండా డియో ఉంది. దీని అమ్మకాలు 24,134 యూనిట్లు. ఇక ఆరో స్థానంలో చూస్తే.. హీరో ప్లీజర్ ఉంది. దీని అమ్మకాలు 14,927 యూనిట్లుగా నమోదు అయ్యాయి. తర్వాతి స్థానంలో హీరో డెస్టినీ నలిచింది. దీని అమ్మకాలు 14,759 యూనిట్లు ఉన్నాయి. తర్వాత సుజుకీ బర్గ్మాన్ ఉంది. దీని అమ్మకాలు 12,557 యూనిట్లుగా నమోదు అయ్యాయి. తర్వాత యమహా రేజెడ్ఆర్ ఉంది. దీని అమ్మకాలు 11,683 యూనిట్లు.
ఇక పదో స్థానంలో యమహ ఫాసినో ఉంది. దీని అమ్మకాలు 10,501 యూనిట్లుగా ఉన్నాయి. అంటే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో హీరో కంపెనీవి రెండు స్థానం దక్కించుకున్నాయి. అలాగే యమహా కంపెనీవి కూడా రెండు స్కూటర్లు ఉన్నాయి. సుజుకీ, టీవీఎస్ కంపెనీలకు చెందిన స్కూటర్లు కూడా రెండేసి చొప్పున జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. హోండా కంపెనీకి చెందిన స్కూటర్లు కూడా రెండే ఉన్నాయి. అంటే ప్రతి కంపెనీకి చెందిన రెండేసి స్కూటర్లు లిస్ట్‌లో స్థానం పొందాయని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Ev scooters, Honda, SCOOTER