కరోనా కారణంగా ల్యాప్‌టాప్‌ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఓవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, మరోవైపు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో ప్రముఖ స్మార్ట్బ్రాండ్లు తమ ల్యాప్‌టాప్ విక్రయాలు పెంచుకునేందుకు వరుసగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో వివిధ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపులు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ పీసీ బ్రాండ్ ఏసర్ ఇండియా సరికొత్త ఇయర్ ఎండ్ సేల్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ స్టాక్ క్లియర్ చేసుకునేందుకు ‘లూట్ అవర్ స్టోర్ సేల్’తో ముందుకొచ్చింది. నేడు (డిసెంబర్ 16)న ప్రారంభమవుతున్న ఈ లూట్ అవర్ స్టోర్ సేల్ రేపటితో (డిసెంబర్ 17) తో ముగుస్తుంది. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే లూట్ అవుట్ స్టోర్ సేల్ అందుబాటులో ఉంటుంది.
Bikes: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ.1 లక్షలోపు లభిస్తున్న టాప్ బైక్స్ ఇవే
ఏసర్ లూట్ అవర్ స్టోర్ సేల్ భాగంగా అన్ని ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీస్‌పై 67 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, కేవలం ఏసర్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా నో-కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ వారంటీ ఎక్స్టెన్షన్ వంటి మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరోవైపు, కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నట్లు ఏసర్ ఇండియా తెలిపింది.
* ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్
లూట్ అవర్ స్టోర్ సేల్‌లో భాగంగా రూ. 25 వేల ఏసర్ ల్యాప్‌టాప్‌లను రూ. 23,990 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కంపెనీ రూ. 40,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మరోవైపు, గేమింగ్ యాక్సెసరీలపై 67 శాతం డిస్కౌంట్ అందజేస్తుంది. ఏసర్ టాబ్లెట్, మానిటర్ల కొనుగోలుపై రూ. 7,690 విలువ గల ఏసర్ నిట్రో హెడ్సెట్లను ఉచితంగా అందిస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద కస్టమర్లకు 2 సంవత్సరాల వారెంటీ ఎక్స్టెన్షన్ కూడా లభిస్తుంది. అదనంగా ఒక సంవత్సరం డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది.
కాగా, ఈ ఏసర్ ఉత్పత్తులను నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. ఏసర్ లూట్ అవట్ స్టోర్ సేల్‌తో పాటు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కూడా ఇదే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా రియల్మీ, శామ్సంగ్, ఒప్పో, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.