హోమ్ /వార్తలు /బిజినెస్ /

Yono SBI App: ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లో లభించే బ్యాంకింగ్ సేవలు ఇవే

Yono SBI App: ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌లో లభించే బ్యాంకింగ్ సేవలు ఇవే

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Yono SBI | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా అనేక బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందించేందుకు యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ రూపొందించిన సంగతి తెలిసిందే. యోనో ఎస్‌బీఐ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ కూడా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎస్‌బీఐ కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు. ఇందులో కొన్ని సేవల గురించే యూజర్లకు తెలుసు. కానీ అనేక సేవల్ని యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి యోనో ఎస్‌బీఐ యాప్‌లో ఎలాంటి సేవలు లభిస్తాయి? ఇంట్లోనే ఉంటూ ఏఏ బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు? తెలుసుకోండి.

  Gold Purity Check: బంగారు నగలు నకిలీవా? ఒరిజినలా? ఈ చిట్కాలతో మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి

  Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త

  యోనో ఎస్‌బీఐ యాప్‌లో మై అకౌంట్స్ సెక్షన్ ఉంటుంది. అందులో సేవింగ్స్, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ మినీ స్టేట్‌మెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకే కస్టమర్ రెండు ఎస్‌బీఐ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నా ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్‌బీఐలో రుణాలు తీసుకున్నవారు తమ లోన్ అకౌంట్స్‌కు సంబంధించిన వివరాలు చూడొచ్చు. ఇక ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినవారు డిపాజిట్ అకౌంట్ మినీ స్టేట్‌మెంట్ పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన లేదా పీపీఎఫ్ అకౌంట్స్ ఉన్నవారు కూడా ఆ స్కీమ్స్ వివరాలు పొందొచ్చు. మొబైల్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

  Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో బిజినెస్... కోట్ల రూపాయల టర్నోవర్

  Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

  సొంత అకౌంట్లకు, థర్డ్ పార్టీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగించొచ్చు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం. ఐఎంపీఎస్ పర్సన్ 2 పర్సన్ సేవల్ని కూడా ఈ యాప్‌లో ఉపయోగించుకోవచ్చు. రిసీవర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయడానికి క్విక్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ఉపయోగపడుతుంది. మొబైల్ రీఛార్జ్ చేయడం కూడా యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా సాధ్యమే. డీటీహెచ్, ఇతర బిల్ పేమెంట్స్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఎస్‌బీఐ లైఫ్ సేవల్ని కూడా యోనో ఎస్‌బీఐ యాప్‌లో పొందొచ్చు. ఇన్స్యూరెన్స్ కొనుగోలు చేయొచ్చు.

  కార్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లాంటి రుణాలకు కూడా యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా దరఖాస్తు చేయడం సులువే. యోనో ఎస్2బీఐ యాప్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేస్తే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. బ్యాంకులో రుణాలకు అప్లై చేసే కస్టమర్ల కన్నా, యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో అప్లై చేసే కస్టమర్లకు ఎస్‌బీఐ తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank loan, Bank loans, Bank news, Banking, Personal Finance, Sbi, State bank of india, Yono, Yono app

  ఉత్తమ కథలు