• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ACCOUNT BALANCE CHECK TO CASH DEPOSIT STATE BANK OF INDIA SBI AUTOMATED DEPOSIT CUM WITHDRAWAL MACHINE ADWM OFFERS THESE BANKING SERVICES SS

SBI ADWM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో ఈ మెషీన్ చూశారా? ఇలా వాడుకోండి

SBI ADWM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో ఈ మెషీన్ చూశారా? ఇలా వాడుకోండి

SBI ADWM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో ఈ మెషీన్ చూశారా? ఇలా వాడుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Cash Deposit Machine | మీకు దగ్గర్లో ఎస్‌బీఐ క్యాష్ డిపాజిట్ మెషీన్ ఉందా? అనేక బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎం సెంటర్లలో ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్స్-ADWM కూడా ఉంటాయి. ఈ మెషీన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియక కస్టమర్లు ఈ మెషీన్ గురించి పెద్దగా పట్టించుకోరు. మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎం సెంటర్‌లో ADWM ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలావరకు పనులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అనేక బ్యాంకింగ్ సేవల్ని ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లో సులువుగా పొందొచ్చు. ఇదేమీ పెద్ద కష్టమేమీ కాదు. ఆ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చాలు.

    SBI ADWM: ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లో బ్యాంకింగ్ సేవలు పొందండి ఇలా


    ఎస్‌బీఐ ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లో అన్ని సేవల్ని పేపర్‌లెస్‌గా పొందొచ్చు. క్యాష్ డిపాజిట్ చేయడం చాలా ఈజీ. కార్డు లేకుండా నేరుగా క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఒకసారి రూ.49,900 మాత్రమే డిపాజిట్ చేయడం సాధ్యమవుతుంది. అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలనుకుంటే పాన్ నెంబర్ తప్పనిసరి. డెబిట్ కార్డుతో రూ.2,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. సొంత అకౌంట్‌లోకి మాత్రమే కాదు... ఇతర అకౌంట్లలోకి కూడా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.

    Personal Finance: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు

    EPF Account: అలర్ట్... ఈపీఎఫ్ అకౌంట్‌లో ఈ వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు రావు


    ఎస్‌బీఐ ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లో ఒకేసారి 200 కరెన్సీ నోట్లు మాత్రమే డిపాజిట్ చేయడం సాధ్యమవుతుంది. రూ.100, రూ.200, రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లు డిపాజిట్ చేయొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో పర్సనల్ అకౌంట్‌లోకి డబ్బులు డిపాజిట్ చేస్తే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇతర డిపాజిట్లకు కనీసం రూ.22+జీఎస్‌టీ చెల్లించాలి.

    Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సింపుల్‌గా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవండి ఇలా

    SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయా?

    ఎస్‌బీఐ ఆటోమెటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లో పీపీఎఫ్, రికరింగ్ డిపాజిట్, లోన్ అకౌంట్లకు కూడా నేరుగా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. ఈ మెషీన్‌లో డబ్బులు కూడా డ్రా చేయొచ్చు. అంటే ఏటీఎంలా పనిచేస్తుంది. యోనో క్యాష్ ద్వారా కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ చేయడం కూడా సాధ్యమే. ఏటీఎం కార్డు అవసరం లేకుండా యోనో ఎస్‌బీఐ యాప్‌తో డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్ ద్వారా రూ.20,000 వరకు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ చేయొచ్చు. ఈ మెషీన్‌లో మీ పాస్‌వర్డ్ కూడా అప్‌డేట్ చేయొచ్చు. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. మినీ అకౌంట్ స్టేట్‌మెంట్ ప్రింట్ తీసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌లో గత 10 లావాదేవీల వివరాలు ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు