Home /News /business /

ACCORDING TO REPORTS PPF SENIOR CITIZEN SAVINGS SCHEME AND SUKANYA SAMRIDDHI INTEREST RATES TO BE HIKED SOON UMG GH

Savings Schemes: సేవింగ్ స్కీమ్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు పెరిగే అవకాశం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లపై వడ్డీ రేట్లు జూన్ 30న అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఈ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
చాలా మంది స్టాక్ మార్కెట్లలో (stock market) కంటే పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌ (Saving Scheme)లో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే ఇవి సురక్షితమైనవి. పైగా స్థిరంగా రాబడిని పొందవచ్చు. దీంతో పోస్టాఫీసులో చిన్న పొదుపు పథకాలు అత్యంత విశ్వసనీయమైనవిగా పేరుపొందాయి. పైగా వీటికి ప్రభుత్వ సపోర్ట్ (Government) ఉంటుంది. ఇందులో మంత్లీ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కీలకమైనవి. వీటి ద్వారా ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం స్థిరమైన రాబడి పొందవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లపై వడ్డీ రేట్లు జూన్ 30న అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఈ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రయోజనం చేకూరనుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికం చివరిలో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌కు తాజా రేట్లను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జూన్ 30 మొదటి త్రైమాసికం (Q1) ముగింపు. దీంతో వడ్డీరేట్లను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. అయితే గత కొన్ని నెలలుగా, ప్రభుత్వం వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచిన సంగతి తెలిసిందే.



* ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..
పోస్టాఫీస్‌ సేవింగ్స్ స్కీమ్‌లపై ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నెలాఖరు వరకు అంటే జూన్ 30 వరకు ఈ రేట్లు చెల్లుబాటులో ఉంటాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1శాతం

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 6.8 శాతం

సుకన్య సమృద్ధి యోజన: 7.6 శాతం

కిసాన్ వికాస్ పత్ర: 6.9 శాతం

సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం

ఒక సంవత్సరం టైమ్ డిపాజిట్: 5.5 శాతం

రెండేళ్ల టైమ్ డిపాజిట్: 5.5 శాతం

మూడేళ్ల టైమ్ డిపాజిట్: 5.5 శాతం

ఐదేళ్ల టైమ్ డిపాజిట్: 6.7 శాతం

ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్: 5.8 శాతం

ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 7.4 శాతం

ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్: 6.6 శాతం

కాగా, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ, రెండు సమావేశాల్లో రెపో రేట్లను 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణగ్రహీతలు వివిధ రుణ కాలవ్యవధిలో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా పెట్టుబడిదారులకు మంచి రాబడి వస్తుంది. ఆర్బీఐ నిర్ణయం ఫలితంగా పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిఫాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇదే బాటలో కేంద్ర ప్రభుత్వం పయణించే అవకాశం ఉంది. PPF, MIS, SSYలపై కూడా వడ్డీ రేట్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Interest rates, PPF, Schemes, Senior citizens

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు