ప్రపంచంలోనే ఇండియన్ రైల్వే (Indian Railway) నెట్‌వర్క్ చాలా పెద్దది. లక్షలాది మంది ప్రయాణికులను నిత్యం ఇండియన్ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తోంది. కొన్ని మార్గాల్లో అనేక మంది ప్రయాణికులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు బోగీలు శుభ్రంగా లేక పోవడం, టాయిలెట్స్ దుర్వాసన, నీళ్లు అందుబాటులో లేకపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటి సమస్యలను చెక్ పెట్టడానికి ఇండియన్ రైల్వేస్ 2018లో రైల్ మదత్ (Rail Madad) యాప్‌ను ప్రవేశపెట్టింది. రైల్ మదత్ యాప్ ద్వారా ప్రయాణీకులు సమస్యలను 35 కేటగిరీల్లో ఫిర్యాదు చేయవచ్చు.
* ఫోటోలు అప్‌లోడ్ చేసేలా డిజైన్
ఈ యాప్ ద్వారా రైళ్లు, రైల్వే స్టేషన్స్‌లో సౌకర్యాలపై ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వక ఫిర్యాదుతో పాటు ఫోటోలను కూడా అప్‌లోడ్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రైళ్లలోని పారిశుద్ధ్యంపై ఎక్కువసార్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
గరీబ్ రథ్ వంటి రైళ్లలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని ఈ యాప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ న్యూస్ అవుట్‌లెట్ జాగరణ్.. 2022 డిసెంబర్‌లో రైల్ మదత్ యాప్‌లో నమోదైన పారిశుద్ధ్యం ఫిర్యాదులను పరిశీలించింది. ఆ వివరాల ప్రకారం దేశంలోనే అత్యంత అపరిశుభ్రంగా ఉన్న రైళ్ల జాబితాను వెల్లడించింది.
* జయనగర్-అమృతసర్ క్లోన్ స్పెషల్
ఈ రైలు యూపీలోని జయ నగర్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. గతేడాది డిసెంబర్‌లో ఈ రైలుపై 92 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో 50 పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించినవే ఉన్నాయి.
* సీమాంచల్ ఎక్స్‌ప్రెస్
ఈ రైలు న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి బీహార్‌లోని జోగ్బాని వరకు నడుస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు అపరిశుభ్రంగా ఉందని 52 ఫిర్యాదులు వచ్చాయి. జోగ్బాని నుంచి న్యూఢిల్లీ వెళ్లే మరో సీమాంచల్ ఎక్స్ ప్రెస్‌లో పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేదని 67 ఫిర్యాదులు వచ్చాయి.
* సహర్స-అమృతసర్ గరీబ్ రథ్
ఈ రైలు తూర్పు బీహార్‌లోని సహర్సా నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు ప్రయాణిస్తుంది. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా అపరిశుభ్రతకు సంబంధించినవి ఉన్నాయి. ఈ గరీబ్ రథ్‌లో శుభ్రత లోపించిందని 81 ఫిర్యాదులు వచ్చాయి. నీటి సమస్యపై 58 ఫిర్యాదులు వచ్చాయి.
ఇది కూడా చదవండి : ఏడాదికి రూ.1999 కడితే చాలు.. ఓలా కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు..
* త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్
ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ త్రిపుర రాజధాని అగర్తలా నుంచి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ మధ్య నడుస్తుంది. ఫిరోజ్‌పూర్‌లో ప్రారంభమయ్యే రైలులో పరిశుభ్రతపై గతేడాది డిసెంబర్‌లో 57 మంది ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
* స్వరాజ్ ఎక్స్‌ప్రెస్
జమ్మూలోని శ్రీ వైష్ణో దేవి - ముంబైలోని బాంద్రా మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఇందులో సౌకర్యాలు సరిగా లేవని, బోగిలు అపరిశుభ్రంగా ఉన్నాయని 64 ఫిర్యాదులు వచ్చాయి. ఇక బాంద్రా నుంచి జమ్ము బయలుదేరే రైలులో పరిశుభ్రతపై 61 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై అధికారులకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Indian Railways, Train