హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business news: 4 రోజుల్లోనే ఆ రెండు కంపెనీల షేర్లతో రూ.1331 కోట్లు సంపాదించిన ఘనుడు.. ఎవరో తెలుసా.

Business news: 4 రోజుల్లోనే ఆ రెండు కంపెనీల షేర్లతో రూ.1331 కోట్లు సంపాదించిన ఘనుడు.. ఎవరో తెలుసా.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షేర్​ మార్కెట్​ వ్యక్తులను కుబేరులు చేయగలదు. అలాగే బికారీ చేయగలదు. అయితే ఇక్కడ ఓ రెండు కంపెనీల షేర్లు ఓ వ్యక్తికి వేయి కోట్లకు పైగా ఆర్జించి పెట్టాయి. ఆ వ్యక్తి సంపద ఏకంగా రూ.1,331 కోట్లు పెరిగిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ( Rakesh Jhunjhunwala). షేర్​ మార్కెట్​లో ఈయన పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఆయన భాగస్వామ్యంలోని ఆకాశ ఎయిర్ సంస్థ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ ఇటీవలె అంగీకారం తెలిపింది. బిగ్ బుల్ జోరు అంతటితో ఆగలేదు. రాకేశ్​ లిస్టెడ్ హోల్డింగ్స్‌లో టాటా గ్రూపు షేర్లు కూడా ఉన్నాయి. టాటా గ్రూప్‌ (Tata group)కు చెందిన రెండు షేర్లు భారీ లాభాలు (profit) ఆర్జించడంతో రాకేశ్​ సంపద (assets) నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.1,331 కోట్లు పెరిగిందని మార్కెట్ నిపుణులు (market analysts) అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్‌కి చెందిన టైటాన్, టాటా మోటార్స్ షేర్లు ఆయనకు నాలుగు ట్రేడింగ్ సెషన్ల (Trading sessions)లో భారీ లాభాలు ఆర్జించి పెట్టాయి. మునుపటి వారంతో పోల్చితే.. ఈ వారం టాటా మోటార్స్ (Tata motors) షేర్ విలువ 30 శాతం మేర లాభపడగా.. టైటాన్ 8.98 శాతం మేర లాభపడినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  టైటాన్‌ కంపెనీ షేర్లు..

  టైటాన్‌ కంపెనీ షేర్లను ఝున్‌ఝున్‌వాలా (Jhunjhunwala)కు కొన్నేళ్లుగా తన ఫోర్టుపోలియోలో ఉంచుకున్నారు. ఈ కంపెనీలో రాకేశ్ కుటుంబానికి (Rakesh family) 4.26 కోట్ల షేర్లు ఉన్నాయి. టైటాన్‌లో వారికి 4.81 శాతం వాటా ఉంది. గత వారం ఈ మొత్తం విలువ రూ.10,046 కోట్లు కాగా నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో 9 శాతం (percent) వరకు పెరిగింది. షేరు ధర రూ.2,567కే చేరుకోవడంతో ఝున్‌ ఝున్‌ వాలాకు రూ.902 కోట్ల లాభం వచ్చింది.  2021 టైటాన్‌ కంపెనీ షేరు 65 శాతం పెరిగింది.

  టాటా మోటార్స్‌..

  గత వారాంతంలో ఆయన దగ్గర టాటా మోటార్స్‌ (tata motors)కు చెందిన 3.77 కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. దీని విలువ రూ.1,445 కోట్లుగా ఉండగా.. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో దీని విలువ రూ.1,874 కోట్లకు చేరింది. దీంతో ఈ ఒక్క షేర్‌తోనే ఆయన సంపద రూ.429.59 కోట్లు పెరిగింది.

  ఇతర షేర్లు కూడా..

  స్టాక్ మార్కెట్‌ (stock market)లు రికార్డు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఆయన లిస్టెడ్ హోల్డింగ్స్‌లోని ఇతర షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్‌కార్డ్ బయోటెక్ తదితర ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి. ఈ ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ వారంలో (this week) ఆయన ధనార్జన మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉంది.

  ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా..

  ఝున్‌ఝున్‌వాలా తన సంస్థ ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు. 1986లో ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5 వేల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ రూ. 43 చొప్పున కొనగా.. కేవలం మూడు నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కక్కటి రూ. 143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్‌లో ఆయన విజయాలలో అది మొదటిదిగా చెబుతున్నారు. ఈ వారం వచ్చిన ఆదాయాన్ని కలుపుకుని ఆయన సంపద దాదాపు రూ. 50 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: BUSINESS NEWS, Profits, Stock Market

  ఉత్తమ కథలు