హోమ్ /వార్తలు /బిజినెస్ /

Housing Sector: పెరుగుతున్న వడ్డీ రేట్లతో గృహ నిర్మాణ రంగంపై నీలి నీడలు.. 2023 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు..

Housing Sector: పెరుగుతున్న వడ్డీ రేట్లతో గృహ నిర్మాణ రంగంపై నీలి నీడలు.. 2023 బడ్జెట్‌పై ఎన్నో ఆశలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Housing Sector: బడ్జెట్‌లో పన్ను రాయితీలు, ఆర్థిక సహాయం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా హౌసింగ్ పరిశ్రమకు హెల్ప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నిపుణులు 2023 బడ్జెట్‌లో హౌసింగ్ మార్కెట్‌కి సహాయపడే మరో 5 బడ్జెట్ ప్రకటనలను కూడా అంచనా వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

2022లో గృహనిర్మాణ రంగం (Housing Sector) బాగా పుంజుకుంది. గృహాలు, అపార్ట్‌మెంట్ నిర్మాణాలు, అమ్మకాలు, అద్దె కార్యకలాపాలు 2021తో పోలిస్తే 2022లో రెట్టింపు స్థాయిలో జరిగాయి. అయితే ఇండస్ట్రీకి చెందిన అనలిస్టుల ప్రకారం, 2023లో హౌసింగ్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌లో నడవకపోవచ్చు. రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ అతుల్ మోంగా ప్రకారం, నిరంతరం పెరుగుతున్న వడ్డీ రేట్లే అందుకు కారణం. అందువల్ల బ్యాంక్‌లు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలానే 2023 బడ్జెట్ (2023 Budget) పన్ను రాయితీలు, ఆర్థిక సహాయం వంటి కొనుగోలుదారులు, విక్రేతలకు ప్రయోజనం చేకూర్చే చర్యలను అమలు చేయడం ద్వారా హౌసింగ్ పరిశ్రమకు హెల్ప్ చేయగలదని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నిపుణులు 2023 బడ్జెట్‌లో హౌసింగ్ మార్కెట్‌కి సహాయపడే మరో 5 బడ్జెట్ ప్రకటనలను కూడా అంచనా వేస్తున్నారు. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

* హోమ్ లోన్ రూల్స్‌లో మార్పులు

మోర్టగేజ్ ఫైనాన్స్ కంపెనీ IMGC చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ, గృహ రుణాలను మరింత సరసమైనదిగా చేయడానికి వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజానికి లోన్ రేట్లు ఆర్‌బీఐ పాలసీ రేట్ల ద్వారా డిసైడ్ అవుతాయి. అందుకే ఆ విషయం వదిలేసినా.. 2023 బడ్జెట్ అనేది మినిమం డౌన్ పేమెంట్ అవసరాన్ని తగ్గించడం వంటి చర్యలు చేపట్టి గృహ కొనుగోలుదారులకు సహాయ పడొచ్చని ఆయన అన్నారు.

* పన్ను మినహాయింపు

వడ్డీ రేట్ల పెంపు వల్ల రియల్ ఎస్టేట్, గృహ రుణ పరిశ్రమలు గణనీయంగా ప్రభావితమవుతాయని అంచనా. నిజానికి వడ్డీ రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెక్షన్ 24(బి) ప్రకారం హౌసింగ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచడం వంటి చర్యలు చేపట్టాలి.

* జీఎస్టీ ఉపశమనం

చవకైన, నిర్మాణంలో ఉన్న గృహాలపై ప్రస్తుత GST స్ట్రక్చర్ డెవలపర్లపై అదనపు భారాన్ని మోపుతుంది. కొనుగోలుదారుల కోసం యూనిట్ల ధరను పెంచుతుంది. స్టీల్, సిమెంట్‌పై 18%, 28% GST ఉన్నా, డెవలపర్లు ఈ ఇన్‌పుట్ మెటీరియల్‌లపై చెల్లించిన GSTకి పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేరు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ప్రభుత్వం రిస్టోర్ చేస్తున్నట్లు ప్రకటిస్తే, అది డెవలపర్‌లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు.

PAN Card: పాన్ కార్డు విషయంలో బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... మార్చి 31 తర్వాత షాక్

* రెంటల్ హౌసింగ్

Pharande Spaces, CREDAI పూణే-మెట్రో ప్రెసిడెంట్ అనిల్ Pharande ప్రకారం, భారతీయ అద్దె గృహాల రంగం (Rental Housing Sector) ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అద్దె గృహ నిర్మాణాలను నిర్మిస్తున్న డెవలపర్లకు పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించవచ్చు.

* అఫర్డబుల్ హౌసింగ్ లిమిట్‌లో మార్పు

ప్రస్తుతం ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ లిమిట్‌ రూ. 45 లక్షల ధర అనేది భారతదేశంలోని చాలా నగరాల్లో తగినది కాదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, దీనిని రూ.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలని కోరుతున్నారు.

First published:

Tags: Housing Loans

ఉత్తమ కథలు