కరోనా (Corona) కారణంగా మనిషి జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగం నుంచి ఎంటర్‌టైన్మెంట్ వరకు అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. వర్క్, షాపింగ్, లైఫ్ తదితర అంశాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ CBRE ఇటీవల ఓ పోల్ నిర్వహించింది. అందుకు సంబంధించిన వివరాలను ‘వాయిసెస్ ఫ్రమ్ ఇండియా’ పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20,000 మందికి పైగా ఈ పోల్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు CBRE పేర్కొంది. ఈ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 60% కంటే ఎక్కువ మంది భారతీయలు (Indians) ఉద్యోగం ఎంపికలో జీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.
* మూడు రోజుల ఆఫీస్‌కు 69 శాతం మంది ఓకే
రోజూ ఆఫీస్‌కు రావడానికి ప్రేరేపించే అంశాలుగా బెటర్ వర్క్‌ప్లేస్ సేఫ్టీ, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని 80 శాతం భారతీయలు అభిప్రాయపడ్డారు. 69% ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఇది 78%కి పెరిగే అవకాశం ఉంది. వర్క్‌లో మరింత ఎఫెక్టివ్‌గా ఉండడం, వ్యక్తిగత పరస్పర చర్యల ప్రాధాన్యత, ఇతర ఉద్యోగులతో మరింత కనెక్ట్ కావడం వంటి మూడు విషయాల కారణంగా ఉద్యోగులు ఆఫీస్ రావడానికి ఇష్టపడుతున్నారు.
* రిమోట్ వర్కింగ్‌పై మహిళా ఉద్యోగుల్లో ఆసక్తి
మహిళా ఉద్యోగులు ఉద్యోగం విషయంలో రిమోట్‌గా పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటు ఉద్యోగం అటు ఇంటి పనులను బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉండడంతో రిమోట్‌గా వర్క్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో దాదాపు 39% మంది ఉద్యోగులు హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ ప్యాటర్న్‌లను ఇష్టపడుతున్నారు. వ్యక్తిగత బాధ్యతలు, రవాణా తదితర అంశాల కారణంగా వీరు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌ను ఇష్టపడుతున్నారు. ఇక, దాదాపు 39% మంది ఉద్యోగులు ఆరోగ్య సమస్యల కారణంగా ఆఫీస్ రాకపోవడానికి ఒక కారణంగా పేర్కొన్నారు.
* కొత్త ఇంటికి అధిక ప్రాధాన్యం
భారత ఉద్యోగులు రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి వెళ్లాలనే బలమైన ఉద్దేశాన్ని ప్రదర్శిస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది. దాదాపు 44 శాతం ఉద్యోగులు కొత్త ఇంటికి షిఫ్ట్ కావాలనుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇది 31 శాతంగా ఉండేది. కేవలం 29% మంది బేబీ బూమర్‌లతో పోలిస్తే, Gen-Z రాబోయే రెండేళ్లలో కొత్త ఇంటికి వెళ్లేందుకు ప్రాధాన్యతనిస్తుంది. Gen X మినహా, మిగతా జనరేషన్స్ సిటీలకు సమీపంలోని లోకేషన్స్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని రిపోర్ట్ వెల్లడించింది. 70% కంటే ఎక్కువ మంది అద్దెకు బదులుగా ఇల్లు కొనుగోలుకు మొగ్గుచూపుతున్న విషయాన్ని రిపోర్ట్ హైలైట్ చేసింది.
ఇది కూడా చదవండి : సగం జీతంకే పనిచేయండి.. ఫ్రెషర్లకు షాక్ ఇస్తున్న విప్రో..
* 60-65% మంది ఆన్‌లైన్ షాపింగ్
సిటీల్లో నివసించే వారిలో 60-65% మంది గిఫ్ట్స్, కాస్మొటిక్స్, వస్త్రాఉల, ఫుట్‌వేర్‌తో పాటు అవసరమైన కిరాణా వస్తువుల కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే చిన్న పట్టణాల్లో నివసించే వారిలో 55% కంటే ఎక్కువ ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. మిలీనియల్స్‌లో 70% కంటే ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో అవసరమైన వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అన్ని తరాలకు చెందిన 65% కంటే ఎక్కువ మంది లగ్జరీ ప్రొడక్ట్స్-జువెల్లరీ వంటి వాటి కోసం స్టోర్‌లలో షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job, Online shopping, Personal Finance, Salary