ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కొద్ది రోజుల క్రితం వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీని (Kashi Tent City) ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాశీకి వచ్చే భక్తులకు, పర్యాటకులకు వసతి కల్పించడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారణాసిలో టెంట్ సిటీని (Varanasi Tent City) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గంగానది ఒడ్డున, ఇసుక తీరంపై 200 పైగా గుడారాలను ఏర్పాటు చేశారు. నదికి అవతలి వైపున ఉన్న పవిత్ర నగరంలోని ప్రసిద్ధ ఘాట్‌లు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రత్యక్ష శాస్త్రీయ సంగీతం, సంధ్యా హారతి, యోగా తరగతులు లాంటి అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి.
వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ పబ్లిక్-ప్రైవేట్ మోడ్ పద్ధతిలో టెంట్ సిటీ ప్రాజెక్ట్ చేపట్టింది. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించిన తర్వాత వారణాసికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరిగింది. కొత్తగా చేపట్టిన టెంట్ సిటీ ప్రాజెక్ట్ పెరిగిన భక్తులకు సదుపాయాల్ని అందిస్తుంది. పర్యాటకులు సమీపంలోని వివిధ ఘాట్‌ల నుంచి పడవ ద్వారా టెంట్ సిటీకి చేరుకోవచ్చు. టెంట్ సిటీ అక్టోబర్ నుంచి జూన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలం ఉంటుంది కాబట్టి టెంట్ సిటీని తొలగిస్తారు. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్, జైసల్మేర్‌లోని సాండ్ డ్యూన్స్‌ని వారణాసి టెంట్ సిటీ తలపించడం విశేషం.
Train Tickets: ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? రైలు టికెట్లపై 5 శాతం డిస్కౌంట్ పొందండి
విల్లా, సూపర్ డీలక్స్, డీలక్స్ పేరుతో మూడు రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. విల్లాలో 900 చదరపు అడుగులు, కాశీ సూట్స్‌లో 576 చదరపు అడుగులు, సూపర్ డీలక్స్‌లో 480 నుంచి 580 చదరపు అడుగులు, డీలక్స్‌లో 250 నుంచి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వసతి ఉంటుంది. స్విస్ కాటేజీల్లో ఆర్ట్ గ్యాలరీ, లైబ్రరీ, గేమింగ్ జోన్, రెస్టారెంట్లు, డైనింగ్ ఏరియా, కాన్ఫరెన్స్ సదుపాయాలు, స్పా, యోగా స్టూడియో లాంటి సౌకర్యాలు ఉన్నాయి. గంగా తీరంలో వాటర్ స్పోర్ట్స్, ఒంటె సవారీ, హార్స్ రైడ్ లాంటివి పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.
Vande Bharat Trains: మరో రెండు వందే భారత్ రైళ్లు... ఒకటి షిరిడీకి
కాశీ టెంట్ సిటీ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. https://www.tentcityvaranasi.com వెబ్‌సైట్‌లో ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు. ఛార్జీల విషయానికి వస్తే గంగా దర్శన్ విల్లాలో ఒకరికి రూ.20,000, కాశీ సూట్స్‌లో ఒకరికి రూ.12,000, ప్రీమియం ఏసీ టెంట్‌లో ఒకరికి రూ.10,000, డీలక్స్ టెంట్‌లో రూ.7,500 ఛార్జీలు ఉంటాయి. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్యాకేజీ ధర. ఇందులో బోటు ప్రయాణం, లంచ్, టీ, బోట్ టూర్ , గంగా హారతి, డిన్నర్, కల్చరల్ ప్రోగ్రామ్స్, గంగా స్నానం లాంటివి కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kashi Vishwanath Temple, PM Narendra Modi, Tourism, Varanasi