ABHIBUS TIE UP WITH IRCTC FOR TRAIN TICKET BOOKING SERVICES SS
AbhiBus: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... అభి బస్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ ప్రారంభం
అభి బస్ రైలు టికెట్ సేవల్ని ప్రారభిస్తున్న వ్లాదిమిర్ ఇవనోవ్, సిక్కిరెడ్డి, పీవీ సింధు, రోహిత్ శర్మ
AbhiBus train ticket booking | మీరు రైలు టికెట్ బుక్ చేయడానికి ఐఆర్సీటీసీ వెబ్సైట్ మాత్రమే కాదు చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు అభి బస్ కూడా రైలు టికెట్ బుకింగ్ సేవల్ని ప్రారంభించింది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. బస్సు టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన AbhiBus.com ఇప్పుడు రైలు టికెట్ బుకింగ్ సేవల్ని కూడా అందిస్తోంది. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, సిక్కిరెడ్డి, ప్రియాన్షు రజావత్ తదితరులు హైదరాబాద్ జరిగిన ఈవెంట్లో అభి బస్ రైలు టికెట్ బుకింగ్ సేవల్ని అధికారికంగా ప్రారంభించారు. రైళ్ల సమాచారం, టికెట్ల బుకింగ్, క్యాన్సలేషన్, పీఎన్ఆర్ చెకింగ్ లాంటి సేవల్ని AbhiBus.com ప్రారంభించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది అభి బస్. రైలు టికెట్లు బుక్ చేసేముందు కస్టమర్లు కోచ్ పొజిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు.
మా కస్టమర్ల కోసం రైలు టికెట్ సేవల్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. భారతదేశంలో తక్కువ ఖర్చులో ఎక్కువ మంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేనే. రోజూ 3 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. అలాంటివారికి రైలు టికెట్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ సేవలు ప్రారంభించాం. ముఖ్యంగా పండుగలు, ఇతర సందర్భాల్లో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్ బుకింగ్‌కు సమయం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అందుకే మేం రైలు టికెట్ బుకింగ్ సేవల్ని అందిస్తున్నాం.
అభిబస్ మొబైల్ యాప్‌ను 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 50 లక్షల మంది యాక్టీవ్ యూజర్స్ ఉన్నారు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నేతృత్వంలోని హైదరాబాద్ హంటర్స్ టీమ్‌కు అభి బస్ స్పాన్సర్ కూడా. బస్ టికెట్ సేవల్ని అందించడంలో ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన అభి బస్ ఇప్పుడు రైలు టికెట్ సేవల్ని ప్రారంభించింది.