Alert on PAN AADHAR Linking: పాన్‌కార్డ్ , ఆధార్ లింకింగ్ గడువు ఆరు నెలలు పెంపు...

పాన్ కార్డును ఆధార్ కార్డుతో జత చేసే గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకప్రకటన చేసింది. నేటితో ముగియనున్న ఈ గడువును 6 నెలల పాటు, సెప్టెంబర్ 30 వరకూ పెంచుతూ సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: March 31, 2019, 10:42 PM IST
Alert on PAN AADHAR Linking: పాన్‌కార్డ్ , ఆధార్ లింకింగ్ గడువు ఆరు నెలలు పెంపు...
1. లింక్ పాన్-ఆధార్: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ ప్రకారం పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే.
  • Share this:
పాన్ కార్డును ఆధార్ కార్డుతో జత చేసే గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలకప్రకటన చేసింది. నేటితో ముగియనున్న ఈ గడువును 6 నెలల పాటు, సెప్టెంబర్ 30 వరకూ పెంచుతూ సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్‌ ఆధార్, పాన్ నెంబర్‌ను అనుసంధానించడం తప్పనిసరి చేస్తూ ఐటీ శాఖ గతంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కాగా వరుసగా ఆరోసారి ప్రభుత్వం ఆధార్, పాన్ నెంబర్ అనుసంధాన డెడ్ లైన్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గతంలో సుప్రీంకోర్టు ఆధార్, పాన్ నెంబర్ అనుసంధానించాలని, లేకపోతే ఐటీఆర్ రిటర్న్‌ స్వీకరించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా గత సెప్టెంబర్ నాటికే మొత్తం 41 కోట్ల పాన్ కార్డులు జారీ చేయగా, అందులో 21 కోట్ల పాన్ కార్డులు, ఆధార్ తో అనుసంధానించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే 2017 జూలై 31 లో పాన్ కార్డు, ఆధార్ అనుసంధానానికి చివరి తేదీగా నిర్ణయించి అనంతరం గడువుపొడిగిస్తూ వస్తున్నారు. తాజా పొడిగింపుతో ఇది ఆరోసారి కావడం విశేషం.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు