Home /News /business /

AADHAR GOOD NEWS FOR AADHAR CARD USERS EASIER TO UPDATE EVK

Aadhar: ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్డేట్ చేసుకోవ‌డం మ‌రింత ఈజీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aadhar Services | ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇక ప్రతీ సర్వీస్ కోసం ఆధార్ సేవా కేంద్రానికో (Aadhaar Seva Kendra), ఆధార్ సెంటర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో కొన్ని సేవల్ని పొందొచ్చు. 

ఇంకా చదవండి ...
    ఆధార్ కార్డ్ హోల్డర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని సేవల్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇక ప్రతీ సర్వీస్ కోసం ఆధార్ సేవా కేంద్రానికో (Aadhaar Seva Kendra), ఆధార్ సెంటర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో కొన్ని సేవల్ని పొందొచ్చు.  ఇక‌పై ఆధార్‌ కార్డ్‌లో కాంటాక్ట్‌ నెంబర్‌ను యాడ్‌ చేయాలన్నా, లేదంటే పిల్లల పేర్లు జత చేయాలన్నా, ఇతర వ్యక్తిగత వివరాల్ని పొందుపరచలన్నా ఆధార్‌ సెంటర్‌కు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చేది.

    BSNL Recharge Offer: బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్లు సూప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.197కు 150 రోజులు బెనిఫిట్స్.. వివ‌రాలు


    ఒక్కోసారి వ్యయప్రాయాసలు గూర్చి ఆధార్‌ సెంటర్‌కు వెళ్లినా భారీ క్యూలు, సర్వర్‌ సమస్యలతో వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి నెలకొనేది. ఈ సమస్యలకు పరిష్కార మార్గంగా యూఐడీఏఐ డోర్‌-టూ- డోర్‌ ఆధార్‌ సర్వీస్‌ సేవల్ని అందించాలని భావిస్తుంది.

    ఇంటి వ‌ద్ద‌కే..
    వినియోగదారులకు ఇంటి వద్ద నుంచే, ప్రత్యేకంగా రిమోట్‌ ఏరియాల్లో ఆధార్‌ సేవల్ని అందించేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం పోస్టాఫీస్‌ (Post Office)కు సంబంధించిన 48వేల మంది పోస్ట్‌ మెన్‌లకు ట్రైనింగ్‌ ఇస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా అదే సమయంలో 2 దశల్లో 1.5లక్షల మందికి పైగా ఆధార్‌ డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌ ల్యాప్‌ ట్యాప్‌ బేస్డ్‌ ఆధార్‌ కిట్‌లపై ట్రైనింగ్‌ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన 13వేల మంది ఉద్యోగులు సైతం ఆధార్‌ సేవల్ని అందించనున్న‌ట్లు స‌మాచారం.

    కొత్త ఆధార్ కేంద్రాలు..
    ఏప్రిల్‌ 4,2022 వీకీపిడియా లెక్కల ప్రకారం..మనదేశంలో ఉన్న మొత్తం 773జిల్లాల్లో ఆధార్‌ సేవా కేంద్రాల్ని ఏర్పాడు చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. అంతే కాకుండా.. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే పొందొచ్చని యూఐడీఏఐ ఇటీవ‌లే తెలిపింది. ఎంఆధార్ యాప్‌లో (mAadhaar App) వీటిని మార్చుకోవచ్చని తెలిపింది.

    Amazon: ఆన్‌లైన్‌ షాపింగ్ మ‌రింత కంఫ‌ర్ట్‌బుల్‌గా.. కొత్త ఫీచ‌ర్ ప్ర‌వేశ పెడుతున్న అమెజాన్‌

    ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. అయితే చిన్న మార్పుల్నే అనుమతిస్తారు. జెండర్‌ను ఒకసారి మార్చుకోవచ్చు. పుట్టినతేదీని కూడా ఓసారి మార్చుకోవచ్చు. అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చవచ్చు. ప్రతీ రిక్వెస్ట్‌కు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వివరాలను కూడా అప్‌డేట్ చేయడం సాధ్యం.

    ప్ర‌స్తుతం ఎంఆధార్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే లేటెస్ట్ వర్షన్ ఇన్‌స్టాల్ చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. ఎంఆధార్ యాప్‌లో 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఎంఆధార్ యాప్ 13 భాషల్లో ఉపయోగించొచ్చు. ఆధార్ కార్డుకు సంబంధించి అప‌డేట్‌ల కోసం జ‌నం ఇబ్బంది ప‌డ‌కుండా యూఐడీఏఐ ప‌లు విధాలుగా వెసులుబాటు క‌ల్పిస్తోంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: AADHAR, Central Government, UIDAI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు