దేశవ్యాప్తంగా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' (One Nation One Ration) పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ కార్డును ఆధార్‌కి లింక్ చేయాలి. (Aadhaar-Ration card linking) దాని ద్వారా మరిన్ని మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ లింక్ గడువును పొడిగిస్తూ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. తాజా గడువు ప్రకారం జూన్ 30, 2022 వరకు రేషన్- ఆధార్ ను లింక్ చేసుకోవచ్చు. దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యం కానుంది. ఇప్పటికి లింక్ చేయడం కుదరిన వాళ్లు త్వరగా లింక్ చేసుకొంటే మేలు. ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే సందేహం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్-ఆధార్ లింక్ (Aadhaar-Ration Link) చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
EPFO Withdraw: ఈపీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
ఆన్‌లైన్ ప్రక్రియ
- ఆన్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్ కార్డును లింక్ చేయొచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన uidai.gov.in ఓపెన్ చేయాలి.
- వెబ్ పేజీలో కనిపించే ‘స్టార్ట్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. కొత్త పేజీ కనిపిస్తుంది.
- ఇందులో అడిగే చిరునామా, రాష్ట్రం, ఫోన్ నంబర్ వంటి వివరాలను నింపాలి.
- అనంతరం 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. వెబ్ పేజీలో OTP నింపిన తర్వాత..
ఈ ప్రక్రియ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది. అనంతరం ఆధార్ ధ్రువీకరణ పూర్తయ్యి, రేషన్ కార్డుతో లింక్ అవుతుంది.
ఆఫ్‌లైన్ ప్రక్రియ
- రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను రేషన్ కార్డు కేంద్రంలో అందించాలి.
- దీని ద్వారా లబ్ధిదారులు ఆఫ్‌లైన్ విధానంలో ఆధార్‌కు రేషన్ కార్డును అనుసంధానం చేయవచ్చు.
- రేషన్ కార్డు కేంద్రంలో ఆధార్ డేటా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా చేయవచ్చు.
- సంబంధిత విభాగానికి ఈ అప్లికేషన్‌ను పంపిస్తారు.
అధికారులు అన్ని వివరాలను పరిశీలించిన తరువాత.. ఆధార్‌కు రేషన్ కార్డు అనుసంధానం పూర్తయినట్లు లబ్ధిదారులకు మెసేజ్ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.