Aadhaar: సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్‌కు ఇక ఆధార్ అవసరం లేదు

Aadhaar | ఇకపై ప్రైవేట్ సంస్థలు నిబంధల్ని ఉల్లంఘించి ఆధార్ డేటా సేకరిస్తే రూ.1 కోటి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.

news18-telugu
Updated: July 9, 2019, 5:10 PM IST
Aadhaar: సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్‌కు ఇక ఆధార్ అవసరం లేదు
Aadhaar: సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్‌కు ఇక ఆధార్ అవసరం లేదు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు కొత్త సిమ్ కార్డ్ కోసం వెళ్తే ఆధార్ ప్రూఫ్ అడుగుతున్నారా? ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ నెంబర్ అడుగుతున్నారా? మీరు మీ ఆధార్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డుకు, బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ తప్పనిసరి కాదు. మీరు స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆధార్ చట్టం సవరణ బిల్లుకు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు జూలై 4న లోక్‌సభలో ఆమోదముద్రపడింది. ఇకపై ప్రైవేట్ సంస్థలు నిబంధల్ని ఉల్లంఘించి ఆధార్ డేటా సేకరిస్తే రూ.1 కోటి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.

టెలిగ్రాఫ్ చట్టం, 1885, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం కేవైసీ కోసం ఆధార్ నెంబర్‌ను పౌరులు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చు. ప్రైవేట్ సంస్థలు బయోమెట్రిక్ ఐడెంటిఫయర్ ఉపయోగించకుండా ఉండేందుకు ఆధార్ చట్టంలోని సెక్షన్ 57 తొలగించాలని బిల్లులో పేర్కొనడం విశేషం. అంతేకాదు... ఆధార్ కార్డు తీసుకున్న పిల్లలు 18 ఏళ్లు దాటిన తర్వాత స్వచ్ఛందంగా బయోమెట్రిక్ ఐడీ ప్రోగ్రామ్ నుంచి వైదొలగొచ్చు. పౌరులు ఆధార్ నెంబర్‌ను వెల్లడించాల్సిన అవసరం లేకుండా ఆల్టర్నేటీవ్ వర్చువల్ ఐడెంటిటీ నెంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌ను పీపుల్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar: పాన్, ఆధార్ కార్డుల కొత్త నిబంధనలివే... తెలుసుకోండి

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోండిలాUPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి
Published by: Santhosh Kumar S
First published: July 9, 2019, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading