Aadhaar Card: ఈ ఆధార్ సేవలకు ఇంటర్నెట్ అవసరం లేదు

Aadhaar Card: ఈ ఆధార్ సేవలకు ఇంటర్నెట్ అవసరం లేదు (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | ఆధార్ సేవలు పొందడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఎస్ఎంఎస్ ద్వారా అనేక సేవల్ని పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    ఆధార్ సేవలు పొందాలంటే ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలని అనుకుంటారు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా అనేక సేవల్ని పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే పలు ఆధార్ సేవలు లభిస్తాయని తెలుసు. అయితే అందుకోసం ఇంటర్నెట్ కావాలి. మరి ఇంటర్నెట్ లేకుండా ఏవైనా ఆధార్ సేవలు లభిస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ఆధార్ సేవలు పొందేందుకు ఇంటర్నెట్ అవసరం లేదు. ఆధార్ కేంద్రానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉంటే చాలు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవల్ని అందిస్తోంది. కేవలం ఎస్ఎంఎస్ పంపి సేవల్ని పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవల్ని పొందాలనుకుంటే ఆధార్ కార్డ్ హోల్డర్లు 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. వేర్వేరు సేవలకు వేర్వేరు ఫార్మాట్లలో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీ జనరేట్ చేయొచ్చు. రిట్రీవల్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు లేదా అన్‌లాక్ చేయొచ్చు. బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయొచ్చు. ఇలా ప్రతీ సేవకు యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 1234-5678-9123 అనుకుంటే ఎస్ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకోండి.

    SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

    EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఒక్క రోజులో రూ.1,00,000 విత్‍డ్రా చేయొచ్చు ఇలా

    వర్చువల్ ఐడీ జనరేట్ చేయడానికి GVID అని టైప్ చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెల్ని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. అంటే GVID 9123 అని టైప్ చేయాలి. వర్చువల్ ఐడీని రీట్రీవ్ చేయడానికి RVID 9123 అని టైప్ చేయాలి. ఇక వన్ టైమ్ పాస్‌వర్డ్ పొందడానికి GETOTP అని టైప్ చేసి చివరి నాలుగు అంకెలు టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు GETOTP 9123 అని టైప్ చేయాలి.

    మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయడానికి ముందుగా GETOTP 9123 అని టైప్ చేసి పంపాలి. ఆ తర్వాత LOCKUID 9123 అని టైప్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ చేయడానికి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. UNLOCKUID అని టైప్ చేయాల్సి ఉంటుంది.

    SBI Branch Change Online: ఎస్‍బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చండి ఇలా

    Bank Account: బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్

    ఇక బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ చేయడానికి ముందుగా పైన చెప్పిన ఫార్మాట్‌లో ఓటీపీ జెనరేట్ చేయాలి. ఆ తర్వాత ENABLEBIOLOCK 9123 టైప్ చేసి ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.బయోమెట్రిక్ లాక్ డిసేబుల్ చేయడానికి ఎస్ఎంఎస్‌లో DISABLEBIOLOCK అని టైప్ చేయాలి. ఇక బయోమెట్రిక్స్‌ని తాత్కాలికంగా అన్‌లాక్ చేయడానికి కూడా ఓటీపీ జనరేట్ చేయాలి. UNLOCKBIO 9123 అని టైప్ చేసి ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

    ఒకవేళ ఆధార్ నెంబర్ బదులు వర్చువల్ ఐడీ ఉపయోగిస్తున్నట్టైతే ఐడీలోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాలి. ఒకే ఫోన్ నెంబర్‌కు ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లు లింక్ అయితే ఆధార్ నెంబర్‌లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాలన్న విషయం గుర్తుంచుకోండి.
    Published by:Santhosh Kumar S
    First published: