• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AADHAAR LETTER EAADHAAR AND AADHAAR PVC CARD ARE VALID SAYS UIDAI SS

Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ పుకార్లు నమ్మొద్దు

Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ పుకార్లు నమ్మొద్దు

Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ పుకార్లు నమ్మొద్దు (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | మీ దగ్గరున్న ఆధార్ కార్డు చెల్లదని ఎవరైనా చెప్పారా? అలాంటి పుకార్లు నమ్మొద్దని హెచ్చరిస్తోంది యూఐడీఏఐ.

  • Share this:
    ఆధార్ కార్డ్... యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేసే ఈ ఐడీ కార్డ్ భారత పౌరులందరికీ తప్పనిసరిగా ఉంటుంది. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తే మొదట ఆధార్ కార్డునే ఇస్తారు. అయితే ఆధార్ కార్డు విషయంలో కొన్ని పుకార్లు ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురి చేస్తోంది. కార్డు రూపంలో ఉండే ఆధార్ మాత్రమే చెల్లుతుందని, లెటర్, ఇఆధార్, పీవీసీ కార్డులు చెల్లవన్న ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డుతో పాటు లెటర్, ఇఆధార్, పీవీసీ కార్డులను కూడా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చని, వీటిని సబ్మిట్ చేసి ప్రభుత్వ సబ్సిడీలు, గ్రాంట్స్ పొందొచ్చని తెలిపింది.

    Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఈ సేవలు ఉచితం... మిగతా వాటికి ఛార్జీలివే

    Aadhaar Card: డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డులో ఈ 5 మార్పులు చేయొచ్చు


    ఆధార్ కార్డు పలు రకాలుగా ఉంటుంది. అందులో ఆధార్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత ఆధార్ లెటర్ పోస్టు ద్వారా వస్తుంది. ఆ సమాచారం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఇక రెండోది ఇఆధార్. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఇఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకు డిజిటల్ వర్షన్ ఇది. భారతదేశంలో ఎక్కడైనా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చు. ఇఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఇఆధార్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ పేరులో మొదటి నాలుగు లెటర్స్ క్యాపిటల్‌లో, పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

    PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫ్‌గా దాచుకోండి ఇలా

    Aadhaar card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ సరిగ్గా ఉందా? అప్‌డేట్ చేయండిలా

    ఇక ఇటీవల ఆధార్ పీవీసీ కార్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పీవీసీ కార్డులో అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. డెమొగ్రఫిక్ వివరాలు, హోలోగ్రామ్, మైక్రో టెక్స్‌ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ, ప్రింట్ తేదీ లాంటివన్నీ ఉంటాయి. పీవీసీ కార్డుపై ఆధార్ లోగో కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులాగా పీవీసీ కార్డును పర్సులో క్యారీ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: