AADHAAR DOWNLOAD TO ORDER AADHAAR PVC CARD GET THESE 11 SERVICES ON MY AADHAAR BETA PORTAL SS
myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే
myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో లభించే 11 రకాల సేవలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
myAadhaar Portal | మీరు ఆధార్ కార్డుకు (Aadhaar Card) సంబంధించి ఏవైనా సేవలు పొందాలనుకుంటున్నారా? మైఆధార్ కొత్త పోర్టల్‌లో 11 రకాల సేవలు పొందొచ్చు. ఏఏ సేవలు లభిస్తాయో తెలుసుకోండి.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డుకు (Aadhaar Card) సంబంధించిన అనేక రకాల సేవల్ని అందిస్తోంది. ఇటీవల https://myaadhaar.uidai.gov.in/ బీటా పోర్టల్‌ను కూడా లాంఛ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా అనేక రకాల ఆధార్ సేవల్ని అందిస్తోంది యూఐడీఏఐ. ఆధార్ నెంబర్ (Aadhaar Number) ద్వారా లాగిన్ అయితే చాలు... పలు రకాల ఆధార్ సేవలు లభిస్తాయి. ఈ సేవలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు. కొన్ని సేవలు ఉచితం. కొన్ని సేవలకు ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవలు పొందాలంటే మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మీ మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరి https://myaadhaar.uidai.gov.in/ బీటా పోర్టల్‌లో లభించే సేవలేవీ? ఆ సేవల్ని ఎలా పొందాలో తెలుసుకోండి.
Download Aadhaar: మీరు ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత Download Aadhaar పైన క్లిక్ చేస్తే డిజిటల్ సంతకం, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉన్న ఆధార్ ఎలక్ట్రానిక్ కాపీ డౌన్‌లోడ్ చేయొచ్చు.
Lock / Unlock Aadhaar: మీరు మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చన్న విషయం మీకు తెలుసా? ఆధార్ నెంబర్ లాక్ చేస్తే ఎవరూ ఉపయోగించడానికి సాధ్యపడదు. ఆధార్ నెంబర్ ఎలా లాక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Order Aadhaar PVC Card: మీరు మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవడానికి ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? ఆధార్ పీవీసీ కార్డ్ డౌన్‌లోడ్ ఆర్డర్ చేయొచ్చు. ఈ ఆధార్ కార్డు ఏటీఎం కార్డులా ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Aadhaar PVC Card Order Status: మీరు ఆర్డర్ చేసిన ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ కూడా మైఆధార్ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత Check Aadhaar PVC Card Order Status పైన క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి.
Locate Enrolment Center: మీరు మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాలనుకుంటున్నారా? దగ్గర్లో ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలియదా? మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి మీకు సమీపంలో ఉన్న ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను లొకేట్ చేయొచ్చు.
Book an Appointment: ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. మై ఆధార్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేయడం సులువే. ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Check Enrolment & Update Status: మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేశారా? లేదా ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో అప్‌డేట్స్ చేశారా? మైఆధార్ పోర్టల్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు.
Retrieve Lost/Forgotten EID/UID: మీరు మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ మర్చిపోయారా? వాటిని మైఆధార్ పోర్టల్‌లో రిట్రీవ్ చేయొచ్చు.
Verify Email/Mobile: మీరు మీ ఆధార్ నెంబర్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేయాలనుకుంటున్నారా? ఇమెయిల్ ఐడీ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నారా? మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి Verify Email/Mobile క్లిక్ చేయండి.
Verify Aadhaar: కొంతకాలంపాటు ఉపయోగించని ఆధార్ నెంబర్లు ఇనాక్టీవ్ అవుతాయి. అందుకే ఆధార్ స్టేటస్‌ను వెరిఫై చేయడానికి మైఆధార్ పోర్టల్‌లో Verify Aadhaar పైన క్లిక్ చేయాలి.
VID Generator: మీ ఆధార్ నెంబర్‌కు 16 అంకెల డిజిటల్ వర్చువల్ ఐడీ జనరేట్ చేయాలనుకుంటే మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత VID Generator క్లిక్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.