Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Aadhaar Download | మీ ఆధార్ వివరాలు మీ దగ్గరుంటే చాలు... స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

news18-telugu
Updated: June 24, 2019, 3:20 PM IST
Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 24, 2019, 3:20 PM IST
ఆధార్ కార్డ్... ఈ రోజుల్లో ప్రతీ చోటా అవసరం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి అవుతోంది. ఇక సిమ్ కార్డులు తీసుకోవడానికి, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి పౌరులు ఆధార్ కార్డును స్వచ్ఛందంగా ఇచ్చే అవకాశముంది. అయితే ఆధార్ కార్డును ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. మీ దగ్గర ఆధార్ కార్డు లేని సమయంలో ఎక్కడైనా ఈ డాక్యుమెంట్ అవసరమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం సులువే. మీ ఆధార్ వివరాలు మీ దగ్గరుంటే చాలు... స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

Aadhaar Download: స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?


మీ స్మార్ట్‌ఫోన్‌లో eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

మీ దగ్గర Aadhaar Number, Enrolment ID-EID, Virtual ID-VID ఉంటే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐలో రిజిస్టరై ఉండాలి.
ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.


క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయాలి.
Loading...
మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఇ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

48 MP Smartphone: రూ.20,000 లోపు 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్లు ఇవే...

Xiaomi: షావోమీ నుంచి ఆ ఫోన్లు బంద్... ఎందుకో తెలుసా?

Google Pay: యాప్‌లో క్రికెట్ ఆడితే రూ.3,300 వరకు స్క్రాచ్ కార్డ్స్
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...