మీరు మీ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయించడానికి ఈమధ్య కాలంలో ఆధార్ సెంటర్‌కు వెళ్లారా? మీ దగ్గర ఎంత వసూలు చేశారు? అసలు ఆధార్ సెంటర్‌లో ఏ సేవకు ఎంత చెల్లించాలి? ఈ సందేహాలు అందరికీ ఉండేవే. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ ఛార్జీలను సవరించింది. బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ పథకాల వరకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం భారతదేశంలో 1,261,984,572 మంది ఆధార్ కార్డులు తీసుకున్నారు. పుట్టిన పిల్లల దగ్గర్నుంచి అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా మాత్రమే కాదు అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అవసరమైన డాక్యుమెంట్.
Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ 5 మార్పులకు డాక్యుమెంట్స్ అవసరం లేదు
PAN-Aadhaar: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సేఫేనా? ఇలా దాచుకోండి
ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా లేనప్పుడు సరిచేసుకోవడం అవసరం. అందుకే ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ సెంటర్లకు, ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి తమ వివరాలు అప్‌డేట్ చేయిస్తుంటారు. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలన్నీ ఉచితంగా లభించవు. కొన్ని సేవలకు డబ్బులు చెల్లించాలి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఆధార్ సేవా కేంద్రంలో వివరాలు ఉంటాయి. అయితే ఈ విషయం తెలియక ఆధార్ కార్డు హోల్డర్లు ఎక్కువ డబ్బులు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆధార్ సేవలకు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తుంది యూఐడీఏఐ. చివరి సారిగా 2020 మే 9న ఈ వివరాలను అప్‌డేట్ చేసింది. ఆ వివరాల ప్రకారం ఆధార్ సేవలపై ఎంత ఛార్జీలు చెల్లించాలో తెలుసుకోండి.
Aadhaar card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ సరిగ్గా ఉందా? అప్‌డేట్ చేయండిలా
E-Aadhaar Card: ఈ స్టెప్స్‌తో ఈజీగా ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయండి
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, మ్యాన్‌డేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్స్ లాంటి సేవల్ని ఉచితంగా పొందొచ్చు. కేవలం ఈ సేవలు పొందితే పౌరులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ సేవా కేంద్రంలో డెమొగ్రఫిక్ అప్‌డేట్‌తో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసినా లేదా కేవలం బయోమెట్రిక్ అప్‌డేట్ చేసినా రూ.100 చెల్లించాలి. కేవలం బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తే రూ.50 చెల్లిస్తే చాలు. ఇక ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసి ఏ4 షీట్‌పైన కలర్ ప్రింట్ తీసుకుంటే రూ.30 చెల్లించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాలతో పాటు ఆధార్ సేవా కేంద్రాల్లో ఇవే ఛార్జీలు ఉంటాయి. ఇంతకన్నా మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక వీటితో పాటు ఆన్‌లైన్‌లో అడ్రస్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి గతంలో ఈ ఛార్జీలు కాస్త తక్కువగా ఉండేవి. ఇటీవల ఈ ఛార్జీలను అప్‌డేట్ చేసింది యూఐడీఏఐ. ఈ ఛార్జీలకు సంబంధించిన వివరాలను https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI