కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటర్ ఐడీలకు ఆధార్ కార్డును (Aadhaar Card) లింక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) కీలక ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటి. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునేవారికి ప్రతీ ఏటా నాలుగు సార్లు తమ ఓటు నమోదు చేయించుకునే అవకాశం కల్పించాలని ఈ బిల్లులో ఉంది. ప్రస్తుతం చూస్తే జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటినవారు మాత్రమే ఓటర్ ఐడీ (Voter ID) కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇకపై ఏటా నాలుగు సార్లు అవకాశం లభిస్తుంది. దీంతో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లింక్ చేయాలన్న కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఇక ఓటర్లు తమ ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేయొచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో, ఎస్ఎంఎస్ ద్వారా, ఫోన్ కాల్, బూత్ లెవెల్ ఆఫీసర్ల దగ్గర ఓటర్ ఐడీ, ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. అయితే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లింక్ చేయడం తప్పనిసరికాదు. ఇది స్వచ్ఛందం. మరి ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
Cash Deposit: ఇక ఆ బ్యాంకులో రూ.10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే
Step 1- ముందుగా https://voterportal.eci.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఓటర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 3- ముందుగా అకౌంట్ క్రియేట్ చేయనట్టైతే Create an account పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి.
Step 4- ఈ వెబ్సైట్లో లాగిన్ చేసిన తర్వాత రాష్ట్రం, జిల్లా, పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఎంటర్ చేయాలి.
Step 5- ఆ తర్వాత ‘Search’ పైన క్లిక్ చేయాలి. మీ వివరాలన్నీ మ్యాచ్ అయితే స్క్రీన్‌పైన డీటెయిల్స్ కనిపిస్తాయి.
Step 6- ఆ తర్వాత ఎడమవైపు ఉన్న ‘Feed Aadhaar No’ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- అందులో మీ ఆధార్ కార్డుపై ఉన్నట్టుగా పేరు, ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 8- వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని ‘Submit’ పైన క్లిక్ చేయాలి.
Business Idea: రూ.10,000 పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... రూ.30,000 వరకు ఆదాయం
మీరు 166 లేదా 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ లింక్ చేయొచ్చు. < Voter ID Number > < Aadhaar_Number > ఫార్మాట్లో మీ ఓటర్ ఐడీ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 166 లేదా 51969 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. లేదా 1950 నెంబర్‌కు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య కాల్ చేసి మీ ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ వివరాలు చెప్పి లింక్ చేయొచ్చు.
ఇక మీకు దగ్గర్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ జిరాక్స్ ఇచ్చి ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ చేయొచ్చు. వెరిఫికేషన్ తర్వాత ఈ రెండు నెంబర్లు లింక్ అవుతాయి. లింకింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి https://voterportal.eci.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి ‘Seeding Through NVSP Portal’ సెక్షన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, Election Commission of India