Aadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు

Proof of Identity documents for Aadhaar Card Verification | మీరు మీ ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు సరిదిద్దుకుంటున్నారా? ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఏఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో తెలుసా? మొత్తం 32 డాక్యుమెంట్స్‌ని స్వీకరిస్తుంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అవేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 18, 2020, 6:29 PM IST
Aadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు
Aadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆధార్ కార్డ్... భారత పౌరులందరికీ అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డ్ ఉంటే చాలాచోట్ల ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా చూపించడం సులువైపోయింది. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా వాడుకుంటున్నారు సరే... మరి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్‌ని ఐడీ ప్రూఫ్‌గా చూపిస్తున్నారు? అసలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఏఏ డాక్యుమెంట్స్‌ని ఐడీ ప్రూఫ్‌గా అనుమతి ఇస్తోంది? మీరు ఆధార్ వెరిఫికేషన్ సమయంలో ఐడీ ప్రూఫ్ కోసం చూపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటీ? ఈ ప్రశ్నలకు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోనే సమాధానం ఉంది. మొత్తం 32 డాక్యుమెంట్స్‌ని ఐడీ ప్రూఫ్‌గా అనుమతిస్తోంది యూఐడీఏఐ. వాటిపై పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. మరి ఆ 32 డాక్యుమెంట్స్ ఏవో తెలుసుకోండి.

Proof of Identity documents: ఆధార్ వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సిన ఐడీ ప్రూఫ్స్ ఇవే...


1. పాస్‌పోర్ట్

2. పాన్ కార్డ్
3. రేషన్ / పీడీఎస్ ఫోటో కార్డ్
4. ఓటర్ ఐడీ


5. డ్రైవింగ్ లైసెన్స్6. ప్రభుత్వ ఫోటో ఐడెంటిటీ కార్డు / ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్
7. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డ్
8. గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడీ
9. ఆయుధాల లైసెన్స్
10. ఫోటో ఉన్న ఏటీఎం కార్డు
11. ఫోటో ఉన్న క్రెడిట్ కార్డు
12. పెన్షనర్ ఫోటో కార్డ్
13. ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్
14. కిసాన్ ఫోటో పాస్‌బుక్
15. CGHS/ ECHS ఫోటో కార్డ్
16. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ జారీ చేసిన అడ్రస్ కార్డ్ (పేరు, ఫోటో ఉండాలి)
17. గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ యూఐడీఏఐ ఫార్మాట్‌లో జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డ్
18. రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాలు, అధికారులు జారీ చేసిన వికలాంగుల ఐడీ కార్డ్ లేదా హ్యాండీక్యాప్డ్ మెడికల్ సర్టిఫికెట్
19. భామాషా కార్డ్
20. గుర్తింపు పొందిన షెల్టర్ హోమ్స్, అనాథాశ్రమాల అధికారి, సూపరింటెండెంట్, వార్డన్, మేట్రన్ జారీ చేసిన సర్టిఫికెట్. యూఐడీఏఐ ఫార్మాట్‌లో ఉండాలి
21. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలర్ యూఐడీఏఐ ఫార్మాట్‌లో జారీ చేసిన సర్టిఫికెట్ ఫోటోతో ఉండాలి
22. విలేజ్ పంచాయతీ అధికారులు జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డ్
23. పేరు మార్చుకున్నట్టు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్
24. ఫోటోతో ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్
25. రాష్ట్రీయ స్వస్త్య బీమా యోజన కార్డ్
26. ఫోటో ఉన్న ఎస్ఎస్ఎల్‌సీ బుక్ సర్టిఫికెట్
27. ఫోటోతో ఉన్న ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్
28. స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ లేదా స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్. పేరు ఫోటో ఉండాలి
29. స్కూల్ హెడ్ మాస్టర్ జారీ చేసిన స్కూల్ రికార్డులు. పేరు, ఫోటో ఉండాలి
30. పేరు, ఫోటో ఉన్న బ్యాంక్ పాస్ బుక్
31. యూఐడీఏఐ ఫార్మాట్‌లో గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు. విద్యాసంస్థ అధినేత సంతకం ఉండాలి
32. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO యూఐడీఏఐ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మాట్‌లో పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్‌తో జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్

మరి ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికి స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Aadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితం

Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు