• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • AADHAAR CARD HOLDERS CAN UPDATE THEIR PHOTO BIOMETRICS GENDER MOBILE NUMBER AND EMAIL ID WITHOUT DOCUMENTS SS

Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ 5 మార్పులకు డాక్యుమెంట్స్ అవసరం లేదు

Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ 5 మార్పులకు డాక్యుమెంట్స్ అవసరం లేదు

Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ 5 మార్పులకు డాక్యుమెంట్స్ అవసరం లేదు (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar card update | ఆధార్ కార్డులో వివరాలన్నీ సరిగ్గా లేకపోతే ప్రభుత్వ పథకాలు పొందడంలో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంలో సమస్యలు వస్తాయి. అందుకో ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

  • Share this:
    మీరు మీ ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేయించాలనుకుంటున్నారా? ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని వివరాలు అప్‌డేట్ చేయడానికి అసలు డాక్యుమెంట్స్ అవసరం లేదు. మీరు నేరుగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్‌గా ఇవ్వకుండా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI వీటిపై క్లారిటీ ఇచ్చింది. డాక్యుమెంట్స్ లేకుండా ఏ వివరాలను అప్‌డేట్ చేయొచ్చో ట్విట్టర్‌లో తెలిపింది. ఆధార్ కార్డులో ఫోటోగ్రాఫ్, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్తే చాలు. మీ వివరాలు అప్‌డేట్ చేయించొచ్చు.


    మీరు మీ వివరాలు అప్‌డేట్ చేయించాలంటే ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. https://appointments.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో మీరు కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేసుకొని వెళ్లి ఆధార్ సేవలు పొందొచ్చు. కొత్తగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దగ్గర్నుంచి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లాంటివన్నీ అప్‌డేట్ చేయొచ్చు. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది యూఐడీఏఐ.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు