ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. మీ ఆధార్ కార్డులో (Aadhaar Card) ఏవైనా వివరాలు అప్‌డేట్ చేయాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్డేట్ చేయొచ్చు. ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేస్తే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ సేవల్ని ఉచితంగా అందిస్తున్నట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లో మూడు నెలల పాటు ఉచితంగా డెమోగ్రఫిక్ వివరాలు అంటే పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్ అప్‌డేట్ చేయొచ్చు.
ఒకవేళ మీ ఫోన్ నెంబర్, బయోమెట్రిక్స్, ఇతర వివరాలు అప్‍డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ఫీజు చెల్లించి తమ వివరాలు అప్‍డేట్ చేయాలి. ఒకవేళ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్ అప్‌డేట్ చేయాలనుకుంటే ఆన్‌లైన్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. కేవలం కొన్ని స్టెప్స్‌తో ఈ వివరాలు అప్డేట్ చేయొచ్చు.
Railway Charges: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఆ టికెట్ ఛార్జీల తగ్గింపు
Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar. If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm
— Aadhaar (@UIDAI) March 16, 2023
దశాబ్దం క్రితం ఆధార్ తీసుకున్నవారు, మధ్యలో ఒక్కసారి కూడా తమ వివరాలు అప్‌డేట్ చేయనట్టైతే, వారంతా తమ ఆధార్ వివరాలు అప్‍డేట్ చేయాలని యూఐడీఏఐ కోరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉచితంగా ఆధార్ వివరాలు అప్‍డేట్ చేసే సదుపాయం వారికి ఉపయోగపడనుంది. ఆధార్ అప్‍డేట్ చేయాలనుకునేవారు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆన్‌లైన్‌లో ఆధార్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్‍డేట్ చేయడానికి https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 8- పేమెంట్ అవసరం లేకుండా ప్రాసెస్ పూర్తి చేయాలి.
Pension Scheme: భార్యాభర్తలకు రూ.18,500 పెన్షన్ ... మార్చి 31 లాస్ట్ డేట్
ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. యూఆర్ఎన్ నెంబర్‌తో మీ ఆధార్ అప్‍డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI