Home /News /business /

AADHAAR CARD DOWNLOAD KNOW HOW CAN YOU DOWNLOAD AADHAAR THROUGH FACE AUTHENTICATION SS

Aadhaar Card Download: మీ ఫేస్ చూపిస్తే చాలు... ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది

Aadhaar Card Download: మీ ఫేస్ చూపిస్తే చాలు... ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Download: మీ ఫేస్ చూపిస్తే చాలు... ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Download | ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయడానికి కొత్త ఫీచర్ తీసుకొస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

    మీరు ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్. జస్ట్ మీ ఫేస్ చూపిస్తే చాలు. ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. 12 అంకెల ఆధార్ నెంబర్, 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ-EID, 16 అంకెల వర్చువల్ ఐడీ-VID ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు. ఏ పద్ధతిలో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలన్నా క్యాప్చా కోడ్ తర్వాత, మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఇవి కాకుండా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా కూడా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసే విధానాన్ని సులభతరం చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

    Indane Gas: ఇండేన్ గ్యాస్ సిలిండర్ వాట్సప్‌లో బుక్ చేయొచ్చు... ఎలాగంటే

    EPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే

    ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Get Aadhaar Card సెక్షన్‌లో Download Aadhaar పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదట మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత Face Authentication ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. UIDAI మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత OK పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.

    Aadhaar SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

    Aadhaar Card: ఆధార్‌లో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు ఓ కాల్ చేయండి చాలు


    ఆధార్ కార్డు హోల్డర్లకు అనేక సేవల్ని అందిస్తోంది యూఐడీఐఏ. అందులో భాగంగా ఇటీవల పీవీసీ కార్డు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఏటీఎం కార్డు సైజులో పీవీసీ ఆధార్ కార్డు ఉంటుంది. రూ.50 చెల్లించి పీవీసీ కార్డు ఆర్డర్ చేయొచ్చు. ఇందులో హోలోగ్రామ్, ఘోస్ట్ ఇమేజ్, మైక్రోటెక్స్ట్‌ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కార్డును ఎక్కడైనా ఉపయోగించొచ్చు. ఆధార్ పీవీసీ కార్డుతో పాటు ఎంఆధార్, ఇఆధార్, ఆధార్ లెటర్ కూడా చెల్లుతాయి. అంటే ఈ నాలుగు ఫార్మాట్లలో మీ దగ్గర ఏ ఫార్మాట్‌లో ఆధార్ కార్డు ఉన్నా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

    తదుపరి వార్తలు