Aadhaar News | ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? వాటిని అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ పనిని ఇంట్లో నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో (Aadhaar Card) అన్ని వివరాలను అప్‌డేట్ చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పుట్టిన తేదీ, అడ్రస్, పేరు, జెండర్ వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మీరు ఇంటి వద్ద నుంచే వాటిని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆధార్ (Aadhaar) కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే.. దాన్ని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆధార్ కార్డు కలిగిన వారు ముందుగా మై ఆధార్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు లాగిన్ అవుతారు. ఇప్పుడు ఆన్‌లైన్ అప్‌డేట్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉటుంది. ఇప్పుడు మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. పేరు, జెండర్, అడ్రస్, పుట్టిన తేదీ అనే ఆప్షన్లు ఉంటాయి.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన బ్యాంక్.. కీలక నిర్ణయం, ఈరోజు నుంచే అమలులోకి!
వీటిల్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేస్తేనే మీ డేట్ ఆఫ్ బర్డ్ అప్‌డేట్ అవుతుంది. లేదంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది. ఏ ఏ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
గోల్డ్ లోన్ కావాలా? చౌక వడ్డీకే బంగారు రుణాలు ఇస్తున్న 10 బ్యాంకులు ఇవే.. చార్జీలు మాఫీ!
ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి మీరు సులభంగానే పుట్టిన తేదీని అప్‌డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లేద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. అలాగే పెన్షనర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉన్నా కూడా ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇంకా మార్క్ షీటు, యూనివర్సిటీ లేదా ప్రముఖ ఎడ్యుకేషన్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉన్నా కూడా పుట్టిన తేదీ అప్‌డేట్ చేసుకునే వీలు ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు ఉన్నా కూడా మీరు పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లలో మీ వద్ద ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కూడా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సులభంగానే మార్చుకోవచ్చు. ఇంట్లో నుంచే మీరు ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన పని కూడా లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, My aadhaar, UIDAI