Aadhaar: మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

Aadhaar Correction | ఆన్‌లైన్‌లోనే మీరు మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. అడ్రస్ ఒక్కటే కాదు పేరు, మొబైల్ నెంబర్, జెండర్, వయస్సు, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్... ఇలా ఆధార్‌లో చాలా వివరాలను మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: April 21, 2019, 8:41 AM IST
Aadhaar: మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
Aadhaar: మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 21, 2019, 8:41 AM IST
మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? అందులో ఏవైనా తప్పులున్నాయా? లేదా ఇటీవల మరో అడ్రస్‌కు మారిపోయారా? ఆధార్ కార్డులో మీ అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? ఇదేమీ పెద్ద కష్టం కాదు. మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మీరు మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. అడ్రస్ ఒక్కటే కాదు పేరు, మొబైల్ నెంబర్, జెండర్, వయస్సు, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్... ఇలా ఆధార్‌లో చాలా వివరాలను మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆఫ్‌లైన్, రెండు ఆన్‌లైన్. ఆఫ్‌లైన్ అంటే మీరు పర్మనెంట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి ఈ మార్పులు చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లోనూ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ పోర్టల్‌లో మీరు మీ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలంటే ముందుగానే ఆధార్ కేంద్రంలో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసి ఉండాలి. మరి ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

Read this: JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్

ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్‌ కరెక్షన్



ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
My Aadhaar సెక్షన్‌లో Update Your Aadhaar పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.


Update your address online పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్‌, ఓటీపీ సాయంతో లాగిన్ కావాలి.
వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత URN జనరేట్ అవుతుంది.
URN ద్వారా ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డ్... భారత పౌరులందరికీ ఓ అవసరమైపోయింది. ఏ పనికి వెళ్లినా ఆధార్‌ తప్పనిసరి అవుతోంది. అయితే ఆధార్ తీసుకున్నప్పుడు అందులో కొన్ని పొరపాట్లు ఉంటే వాటిని మార్చుకోకతప్పదు. లేదా వివరాలు అప్‌డేట్ చేయాల్సిన సందర్భాలు వస్తుంటాయి. సో... ఆన్‌లైన్‌లో తప్పులు సరిచేసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...