హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు

Aadhaar Card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు

Aadhaar Card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)

Child Aadhaar Card | ఐదేళ్లు దాటిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు శుభవార్త. ఆధార్ సెంటర్‌లో మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడానికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే వివరాలు అప్‌డేట్ చేయొచ్చని చెబుతోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

ఇంకా చదవండి ...

మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? వారికి ఐదేళ్ల లోపు ఉన్నప్పుడే ఆధార్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత వివరాలు అప్‌‌డేట్ చేయించలేదా? అయితే ఆ ఆధార్ కార్డులు చెల్లకపోవచ్చు. పిల్లలకు ఐదేళ్ల వయస్సులోపు ఆధార్ కార్డు తీసుకున్నవారంతా తమ పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా వివరాలు అప్‌డేట్ చేయించాల్సిందే. చాలామందికి ఈ విషయాలు తెలియక... ఆధార్ కార్డు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు జారీ చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డ్ బ్లూ కలర్‌లో ఉంటుంది. దాన్ని చైల్డ్ ఆధార్ లేదా బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఆ ఆధార్ కార్డు చెల్లదు. తల్లిదండ్రులు మళ్లీ తమ పిల్లల్ని ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాలి.

మీ పిల్లలకు మొదటిసారి ఆధార్ కార్డు తీసుకునేప్పుడు బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. చైల్డ్ ఆధార్‌ను పిల్లల తల్లిదండ్రులకు లింక్ చేస్తారు. ఐదేళ్లలోపు బయోమెట్రిక్ వివరాలేవీ తీసుకోరు. వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. రిజిస్టర్డ్ అడ్రస్‌కు 60 రోజుల్లో ఆధార్ కార్డ్ వస్తుంది. ఇక పిల్లల వయస్సు ఐదేళ్లు దాటినప్పుడు బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తల్లిదండ్రుల వివరాలతో పాటు పిల్లల వివరాలతో ఫామ్‌ పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ లాంటి అప్‌డేట్ చేసి కొత్త ఆధార్ కార్డ్ జారీ చేస్తారు. కొత్త ఆధార్ కార్డు 90 రోజుల్లో రిజిస్టర్డ్ అడ్రస్‌కు వస్తుంది.

పిల్లల వయస్సు ఐదేళ్లు దాటగానే బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేస్తే సరిపోదు. మళ్లీ వాళ్ల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేయొచ్చు. మరి మీ పిల్లల ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయడానికి ఆధార్ సేవా కేంద్రాల్లో స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Download Aadhaar: ఈ స్టెప్స్‌తో ఆధార్ కార్డ్ ఈజీగా డౌన్‌లోడ్ చేయొచ్చు

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే... 35 ఆధార్ సేవలు పొందొచ్చు

Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరు

First published:

Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Children, UIDAI

ఉత్తమ కథలు