హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card Update: డాక్యుమెంట్స్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చొచ్చు ఇలా

Aadhaar Card Update: డాక్యుమెంట్స్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చొచ్చు ఇలా

Aadhaar: మీకు ఆధార్‌తో సమస్యలు ఉన్నాయా ? డోంట్ వర్రీ.. ఇకపై అన్నింటికీ ఒకే నంబర్‌ (ఫ్రతీకాత్మక చిత్రం)

Aadhaar: మీకు ఆధార్‌తో సమస్యలు ఉన్నాయా ? డోంట్ వర్రీ.. ఇకపై అన్నింటికీ ఒకే నంబర్‌ (ఫ్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Address Update | మీరు మీ ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ఆధార్ కార్డు హోల్డర్లు తమ వివరాలను అప్‌డేట్ చేస్తూ ఉండటం తప్పనిసరి. అయితే వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటేనే అప్‌డేట్ చేయాలి తప్ప, ఎలాంటి మార్పులు లేకపోతే అప్‌డేట్ అవసరం లేదు. చాలావరకు వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. కొన్ని వివరాల కోసం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఏఏ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక గతంలో ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలంటే తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అంతేకాదు... డాక్యుమెంట్స్ లేకపోయినా అడ్రస్ అప్‌డేట్ చేయడం సాధ్యమవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

Aadhaar Card: ఆధార్ కార్డు లేకపోయినా మీ ఆధార్ నెంబర్ 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ప్రాసెస్ ఇదే

Aadhaar Card Addess Update: అడ్రస్ ప్రూఫ్‌తో ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయండి ఇలా...


ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Update Your Aadhar పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Update Demographics Data Online పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత Update Address పైన క్లిక్ చేయాలి.

అందులో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. Update Address via Address Proof లేదా Update Address via Secret Code సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

మొదటి ఆప్షన్ ఎంచుకుంటే మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

అడ్రస్ అప్‌డేట్ కోసం ఏఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Aadhaar Card: మీ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగించారా? తెలుసుకోండి ఇలా

Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

Aadhaar Card Addess Update: అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయండి ఇలా...


మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ లేకపోతే ముందుగా Address Validation Letter తీసుకోవాలి.

Request for Address Validation Letter పైన క్లిక్ చేసిన తర్వాత 4 స్టెప్స్ ఉంటాయి.

1. Resident initiates request, 2. Address verifier consents, 3.Resident submits request, 4.Use secret code to complete.

ఈ నాలుగు స్టెప్స్ పూర్తి చేస్తే మీకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ పోస్టులో వస్తుంది.

మీకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ వచ్చిన తర్వాత పైన చెప్పిన స్టెప్స్‌లో రెండో ఆప్షన్ Update Address via Secret Code ఎంచుకోవాలి.

ఆ తర్వాత సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి ఆధార్ కార్డులో అడ్రస్ అప్‍డేట్ చేయొచ్చు.

ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్-SRN వస్తుంది.

సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్-SRN ద్వారా అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.

First published:

Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు