భారత పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లా మాత్రమే కాదు అనేక పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఉన్నవారికి అనేక సేవల్ని అందిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఇటీవల మరో కొత్త సర్వీస్ కూడా ప్రారంభించింది. పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఇందుకోసం యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో ఒక్క నిమిషంలో తెలుసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Aadhaar Bank Link: ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ తెలుసుకోండి ఇలా
ఆధార్ కార్డ్ హోల్డర్లు ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయాలి.
అందులో Aadhaar Linking Status పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేయాలి.
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.
బ్యాంక్ మ్యాపర్ ద్వారా మీ వివరాలను సేకరిస్తుంది UIDAI.
మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టీవ్‌గా ఉందో లేదో కూడా తెలుస్తుంది.
బ్యాంక్ లింకింగ్ ఎప్పటి నుంచి ఉందో వివరాలు తెలుసుకోవచ్చు.
మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో తెలుసుకోవడానికి మీ ఆధార్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయి ఉండాలి. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఈ వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.