రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా...ఒక బిజినెస్‌మ్యాన్ పశ్చాత్తాపం...

జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని, అయితే కొన్ని విషయాల్లో అంత అవగాహన లేకపోయినా రాణించానని, అయితే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 27, 2019, 8:26 PM IST
రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా...ఒక బిజినెస్‌మ్యాన్ పశ్చాత్తాపం...
నందన్ నీలేకని (ఫైల్ చిత్రం)
  • Share this:
ఇన్ఫోసీస్ సహ వ్యవస్ధాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని తాను రాజకీయాల్లోకి వచ్చి తాను అతిపెద్ద తప్పు చేశానని తెలిపారు. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానని, అయితే కొన్ని విషయాల్లో  అంత అవగాహన లేకపోయినా రాణించానని, అయితే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నందన్ నీలేకని 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన తన సమీప అభ్యర్థి అనంతకుమార్ చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.
First published: July 27, 2019, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading