Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి

Aadhaar Alert | ఎవరూ స్మార్ట్, ప్లాస్టిక్ ఆధార్ కార్డులు ఉపయోగించకూడదని, వాటితో ప్రైవసీకి ముప్పు ఉంటుందని UIDAI ప్రకటించింది.

news18-telugu
Updated: April 30, 2019, 1:32 PM IST
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి
news18-telugu
Updated: April 30, 2019, 1:32 PM IST
మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉందా? అది ప్లాస్టిక్ ఆధార్ కార్డా? ఇకపై ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు. ఆధార్ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారికంగా తీసుకున్న నిర్ణయం ఇది. స్మార్ట్ కార్డ్, పీవీసీ కార్డులు చెల్లవని ఆధార్ అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఎవరూ స్మార్ట్, ప్లాస్టిక్ ఆధార్ కార్డులు ఉపయోగించకూడదని, వాటితో ప్రైవసీకి ముప్పు ఉంటుందని UIDAI ప్రకటించింది. ప్లాస్టిక్ ఆధార్ కార్డులు కొన్నిసార్లు పనిచేయవని, అనధికారికంగా ప్రింట్ చేయడం వల్ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపింది. అంతేకాదు... ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఆధార్ కార్డులు ప్రింట్ చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారానికి ముప్పు తలెత్తుతుందని హెచ్చరిస్తోంది.

Read this: ATM: కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు డ్రా... చేసుకోవచ్చు ఇలా

Loading...
ప్లాస్టిక్, పీవీసీ షీట్లపై ఆధార్ కార్డులు తయారు చేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయని ప్రజలు భావిస్తుంటారు. ఇందుకోసం రూ.50 నుంచి రూ.300 వరకు ఖర్చు చేసినవాళ్లున్నారు. ఇలా డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తోంది ఆధార్ సంస్థ. స్మార్ట్ కార్డ్, ప్లాస్టిక్ కార్డుల మోజులో పడి మీ ప్రైవసీని రిస్క్‌లో పెట్టొద్దు. ఒరిజినల్ కార్డుల్నే వెంట ఉంచుకోవాలని, ఆధార్ అధికారిక వెబ్‌సైట్ eaadhaar.uidai.gov.in ద్వారా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచిస్తోంది. కలర్ ప్రింట్ కూడా అవసరం లేదని, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకున్నాచాలు. ల్యామినేషన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. ల్యామినేషన్ చేయించడం, ప్లాస్టిక్, పీవీసీపై ఆధార్ కార్డు ముద్రించడం వల్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లో సమస్యలొస్తాయి.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్

Amazon Pay: ఇక అమెజాన్ పే నుంచి మనీ ట్రాన్స్‌ఫర్... ఇలా చేయొచ్చు
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...