మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? ఇటీవల ఒక అడ్రస్ నుంచి మరో చిరునామాకు మారారా? అయితే ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవచ్చు. ఆధార్‌లో అడ్రస్ మార్చడం సులువే. ఆన్లైన్లో కూడా అడ్రస్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అడ్రస్ మార్చడానికి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లోనే అడ్రస్ ఎలా మార్చాలో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఆధార్‌లో అడ్రస్ మార్చడానికి అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం మీరు అడ్రస్ ప్రూఫ్ కోసం 45 డాక్యుమెంట్స్ ఇవ్వొచ్చు. అవేంటో తెలుసుకోండి.
Aadhaar Proof of Address: ఆధార్‌లో అడ్రస్ మార్పు కోసం ఇవ్వాల్సిన ప్రూఫ్స్ ఇవే...
1. పాస్‌పోర్ట్
2. బ్యాంక్ స్టేట్మెంట్ / పాస్‌బుక్
3. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్మెంట్ / పాస్‌బుక్
4. రేషన్ కార్డ్
5. ఓటర్ ఐడీ
6. డ్రైవింగ్ లైసెన్స్
7. ప్రభుత్వ ఫోటో ఐడీ / ప్రభుత్వ రంగ సంస్థ ఐడెంటిటీ కార్డ్
8. ఎలక్ట్రిసిటీ బిల్ (గత మూడు నెలల లోపు)
9. వాటర్ బిల్ (గత మూడు నెలల లోపు)
10. టెలిఫోన్ ల్యాండ్‌లైన్ బిల్ (గత మూడు నెలల లోపు)
11. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ (గత ఏడాది లోపు)
12. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ (గత మూడు నెలల లోపు)
13. ఇన్స్యూరెన్స్ పాలసీ
14. ఫోటోతో బ్యాంక్ లెటర్‌హెడ్
15. ఫోటోతో రిజిస్టర్డ్ కంపెనీ లెటర్‌హెడ్
16. ఫోటోతో గుర్తింపు పొందిన విద్యాసంస్థ లెటర్‌హెడ్ లేదా గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడీ అడ్రస్‌తో ఉండాలి.
17. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్
18. ఆయుధాల లైసెన్స్
19. పెన్షనర్ కార్డ్
20. ఫ్రీడమ్ ఫైటర్ కార్డ్
21. కిసాన్ పాస్ బుక్
22. CGHS/ ECHS కార్డ్
23. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్ ఆఫీసర్, తహసీల్దార్ యూఐడీఏఐ ఫార్మాట్లో జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ అడ్రస్ ఫోటోతో ఉండాలి.
24. విలేజ్ పంచాయతీ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ అడ్రస్.
25. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్.
26. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
27. రిజిస్టర్డ్ సేల్, లీజ్, రెంట్ అగ్రిమెంట్.
28. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ జారీ చేసిన అడ్రస్ కార్డ్ (పేరు, ఫోటో ఉండాలి)
29. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ లేదా స్థిర నివాస ధృవీకరణ పత్రం.
30. వికలాంగుల ఐడీ కార్డ్, హ్యాండీక్యాప్డ్ మెడికల్ సర్టిఫికెట్.
31. గ్యాస్ కనెక్షన్ బిల్ (గత మూడు నెలల లోపు)
32. జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్
33. మైనర్ అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్ట్
34. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అకామడేషన్ అలాట్మెంట్ లెటర్. (గత మూడేళ్ల లోపు)
35. ప్రభుత్వం జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్ అడ్రస్‌తో ఉండాలి.
36. భామాషా కార్డ్
37. గుర్తింపు పొందిన షెల్టర్ హోమ్స్, అనాథాశ్రమాల అధికారి, సూపరింటెండెంట్, వార్డన్, మేట్రన్ జారీ చేసిన సర్టిఫికెట్. యూఐడీఏఐ ఫార్మాట్లో ఉండాలి
38. యూఐడీఏఐ ఫార్మాట్లో మున్సిపల్ కౌన్సిలర్ జారీ చేసిన అడ్రస్ సర్టిఫికెట్.
39. గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఐడీ కార్డ్.
40. ఫోటోతో ఉన్న ఎస్ఎస్ఎల్సీ బుక్.
41. స్కూల్ ఐడీ కార్డ్.
42. స్కూల్ టీసీ పేరు అడ్రస్‌తో ఉండాలి.
43. స్కూల్ హెడ్ మాస్టర్ జారీ చేసిన స్కూల్ రికార్డులు. పేరు, ఫోటో ఉండాలి.
44. యూఐడీఏఐ ఫార్మాట్లో గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు. విద్యాసంస్థ అధినేత సంతకం ఉండాలి.
45. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO యూఐడీఏఐ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మాట్లో పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్తో జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్.
ఆధార్‌లో అడ్రస్ అప్డేట్ ఆన్లైన్లో చేయడంతో పాటు ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా అడ్రస్ మార్చుకోవచ్చు. ఇందుకోసం పైన వివరించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రంలో ముందే స్లాట్ బుక్ చేయచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో స్లాట్ ఎలా బుక్ చేయాలో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
Aadhaar Card: ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఈ 32 ఐడీ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు
March 31 Deadline: ఈ 6 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... గుర్తుంచుకోండి