హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health insurance: OPD, 30 డేస్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏంటి? హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై మీకున్న అవగాహన ఎంత?

Health insurance: OPD, 30 డేస్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏంటి? హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై మీకున్న అవగాహన ఎంత?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Health insurance: కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొనే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరాన్నే గుర్తిస్తున్నారు కానీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవట్లేదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance) తీసుకొనే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరాన్నే గుర్తిస్తున్నారు కానీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవట్లేదు. ఇండియాలో అతిపెద్ద జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన ICICI లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్థిక అక్షరాస్యతపై చేపట్టిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. చాలా మంది పాలసీదారులకు హాస్పిటల్‌లో చేరితో ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత చెల్లిస్తుందో మాత్రమే తెలుసని, పాలసీ ఇతర ప్రయోజనాలు తెలియవని పేర్కొంది. వాహన పాలసీదారులకు కూడా వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో అవగాహన లేదని చెప్పింది. సర్వే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ తెలుసుకోవాలి

సర్వేలో భాగమైన 48 శాతం మంది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ హోల్డర్స్‌.. ఔట్-పేషెంట్స్ డిపార్ట్‌మెంట్(OPD), 30 డేస్‌ వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనల గురించి చెప్పలేకపోయారు. ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది సబ్‌ లిమిట్స్‌, డైలీ క్యాష్‌, OPD కవర్, రీసెట్ బెనిఫిట్‌వంటి నిబంధనలను సరిగ్గా వివరించగలిగారు.

మంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఎంచుకోవడానికి అవసరమైన విషయాలపై అవగాహన ఉండకపోవడం ఆందోళనకరం. నిబంధనలపై అవగాహన లేకుండా, తమ అవసరాలకు సరిపడా పాలసీని ఎంచుకోవడం సాధ్యం కాదు. సర్వేలో పాల్గొన్న పాలసీదారులలో 26 శాతం మంది మాత్రమే తమ ససొంత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసని చెప్పారు.

* సరైన హెల్త్‌ కవర్‌ను కొనుగోలు చేయగలరా?

కేవలం 46 శాతం మంది పాలసీ హోల్డర్స్‌ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ పాలసీలను తామే కొనుగోలు చేశామని చెప్పారు. హెల్త్ పాలసీని కొనుగోలు చేయాలనుకునే 51 శాతం మంది కస్టమర్‌లు సరైన పాలసీని ఎంచుకోగలమనే నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంలో యువకులు (21-30 సంవత్సరాలు)కు నిబంధనల గురించి ఎక్కువగా తెలుసు. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్‌ల మధ్య వ్యత్యాసాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు.

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌లను చెల్లించకపోతే ఏం చేయాలి?

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఏవైనా సమస్యలు ఎదురైనా, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌లో ఇబ్బందులు ఉన్నా.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI)కు ఫిర్యాదు చేయాలనే విషయం 40 శాతం కంటే తక్కువ మందికే తెలుసు. మిగతా వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై కూడా అవగాహన లేదు.

ఇది కూడా చదవండి : కొత్త బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలు ఏవి? వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

* సొంత బైక్‌కు కూడా ఇన్సూరెన్స్‌ ఉండాలి

ద్విచక్ర వాహనం , కారు ఉండాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ కొనుగోలు చేయాల్సిన వెహికల్‌ ఇన్సూరెన్స్‌ గురించి ఎక్కువ మందికి తెలియదు. సొంత వాహనం డ్యామేజ్‌ అయినా, తమ కారణంగా ఎదుటివారికి ప్రమాదం జరిగినా నష్టాలను భర్తీ చేసేందుకు ఇన్సూరెన్స్‌ అవసరం. వాహనానికి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ ఉండటం తప్పనిసరి. సగం కంటే తక్కువ (49 శాతం) మోటార్ పాలసీ యజమానులకు ఈ విషయంపై అవగాహన ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్ వాల్యూ (IDV), జీరో-డెప్రిసియేషన్‌ కవర్ గురించి, వెహికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. పాలసీదారుల్లో కేవలం 20 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మోటారు ఇన్సూరెన్స్‌ను అర్థం చేసుకున్నారు.

* ఏం చేస్తే మేలు?

పని చేస్తున్న కంపెనీ యజమాని తల్లిదండ్రులకు గ్రూప్ హెల్త్ కవరేజీని అందించినా.. కనీసం రూ.5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని కొనుగోలు చేయడం మంచిది. ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం, జీవిత దశ అవసరాలలో మార్పు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కవర్‌ని సమీక్షించాలి. మెట్రోలో నివసించే దంపతులు నలభై ఏళ్లలోపు పిల్లలతో ఉంటే, కనీసం రూ. 10 లక్షల కవర్‌ని కొనుగోలు చేయాలి. మంచి పాలసీ అంటే తక్కువ ప్రీమియంతో వచ్చే పాలసీ మాత్రమే కాదు. అందించే బెనిఫిట్స్‌ బావుండాలి.

First published:

Tags: Health Insurance, Insurance, Personal Finance

ఉత్తమ కథలు