మ్యూచువల్ ఫండ్స్... నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టలేనివారికి ఇదో మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇందులో కూడా మొత్తం ఒకేసారి కాకుండా నెలకు కొంత చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు. దాన్నే సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP) అంటారు. అయితే ఒకసారి ఇన్వెస్ట్ చేయడం మొదలైతే మార్కెట్ నష్టాల్లో ఉన్నా, లాభాల్లో ఉన్నా నెలకు మీ వాటా మీరు పెట్టుబడి పెట్టాల్సిందే. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నా మీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మారదు. ఇలా కాకుండా మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ, మార్కెట్ దూసుకెళ్తున్నప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే మీరేం చేస్తారు? ఇప్పుడు కొత్తగా అలాంటి ఫండే స్మార్ట్‌సిప్(SmartSIP).
Read this:
SBI Prize: ఎస్బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే
అసలేంటి ఈ స్మార్ట్‌సిప్(SmartSIP)?
ప్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఫండ్స్ ఇండియా స్మార్ట్‌సిప్ పేరుతో సరికొత్త సిప్ ప్రారంభించింది. టెంపుల్టన్స్ స్కీమ్స్ అయిన ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ ఫండ్(FIEF), ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్(FIUS)లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరు రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే అందులో రూ.700 ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ ఫండ్(FIEF)లో, రూ.300 ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్(FIUS)లో పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత ఫండ్స్ ఇండియా స్మార్ట్ సిప్ సూచనల ప్రకారం పెట్టుబడి వాటాలు మారుతుంటాయి. అయితే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా మీ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ను మార్చుకునే అవకాశమున్న ఇతర
ఫండ్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్సిప్లో మాత్రం మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ, మార్కెట్ దూసుకెళ్తున్నప్పుడు తక్కువ పెట్టుబడి ప్లాన్ చేస్తారు. మీరు కోరుకునే రిటర్న్స్ ఆధారంగా సిప్‌ను ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతీ నెల మీకు ఎంత లాభం వచ్చిందో Fundsindia.com లెక్కించి చెబుతూ ఉంటుంది.
Read this:
IRCTC Account: ఐఆర్సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి
స్మార్ట్‌సిప్(SmartSIP) ఎలా పనిచేస్తుంది?
మీరు ప్రతీ నెల ఒకే మొత్తంలో డబ్బు చెల్లించినా ఈక్విటీ ఫండ్‌లో ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలన్నదాన్ని ఆల్గరిథమ్స్ ద్వారా గుర్తిస్తారు. ఇతర సిప్స్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రతీ నెల మారినా, స్మార్ట్సిప్లో ఒకేలా ఉంటుంది. ఈ రెండు స్కీమ్స్‌లో డబ్బును కేటాయించడం విషయంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మోడల్‌ను 10 ఏళ్ల పాటు పరిశీలించామని, స్మార్ట్ సిప్ ద్వారా మిగతా సిప్ కన్నా 1.6% ఎక్కువ రిటర్న్స్ ఉంటాయని ఫండ్స్ ఇండియా మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ హెడ్ విద్యాబాల చెబుతున్నారు. ఇది కేవలం ఫండ్స్ ఇండియా కస్టమర్ల కోసం రూపొందించిన స్మార్ట్ సిప్. ఇందుకోసం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫండ్స్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. స్మార్ట్ సిప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫండ్స్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే SmartSIPలో ఇన్వెస్ట్ చేయాలనుకునే ముందు ఈ
ఫండ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది.
Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...
Shock: పేటీఎం మాల్లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?