హోమ్ /వార్తలు /బిజినెస్ /

Electric Two-Wheelers: మూడు సరికొత్త Electric Bikes ను లాంచ్ చేసిన స్టార్టప్ కంపెనీ.. ధర లక్షన్నర లోపే..

Electric Two-Wheelers: మూడు సరికొత్త Electric Bikes ను లాంచ్ చేసిన స్టార్టప్ కంపెనీ.. ధర లక్షన్నర లోపే..

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ఎర్త్ ఎనర్జీ (Earth Energy) మూడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్లను లాంచ్ చేసింది. ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ ప్లస్ (Earth Energy guide plus), ఎవాల్వ్ ఆర్ క్రూయిజర్ (evolve cruiser), ఎవోల్వ్ జెడ్ (Earth Energy Evolve) పేరిట ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది.

ఇంకా చదవండి ...

  భారత ఎలక్ట్రానిక్ వెహికిల్స్ (ఈవీ) మార్కెట్లో 10 శాతం వాటాయే లక్ష్యంగా దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ఎర్త్ ఎనర్జీ (Earth Energy) మూడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్లను లాంచ్ చేసింది. ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ ప్లస్ (Earth Energy guide plus), ఎవాల్వ్ ఆర్ క్రూయిజర్ (evolve cruiser), ఎవోల్వ్ జెడ్ (Earth Energy Evolve) పేరిట ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తేనుంది. వీటి ఆన్-రోడ్ ధరలను కూడా ఎర్త్ ఎనర్జీ వెల్లడించింది. భారత మార్కెట్లో ఎర్త్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 92,000, ఎవాల్వ్ ఆర్ క్రూయిజర్ బైక్ రూ. 1.30 లక్షలు, ఎవోల్వ్ జెడ్ ఎలక్ట్రిక్ బైక్ రూ. 1.42 లక్షలకు విక్రయించనుంది. కాగా, ఈ నెలాఖరు నాటికే గ్లైడ్ ప్లస్ ఎలక్ట్రిక్ వాహనం షోరూమ్‌లలో లభించనుండగా, ఎవాల్వ్ Z, R మోడళ్లు మాత్రం మార్చి చివరి నాటికి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

  ఎర్త్ ఎనర్జీకి ప్రస్తుతం ముంబైలో ఏడు డీలర్‌షిప్‌లు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా వాటి సంఖ్యను 45కు విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు ఆన్లైన్ ద్వారా రూ. 1000 చెల్లించి ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మీ సమీపంలోని ఎర్త్ ఎనర్జీ డీలర్‌షిప్ మీరు బుక్ చేసుకున్న వాహనాన్ని మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది. ఈ స్టార్టప్ కంపెనీ త్వరలోనే అవుట్‌లెట్లను కూడా ప్రారంభించనుంది. ఈ అవుట్లెట్లను సందర్శించి కస్టమర్లు స్కూటర్లతో పాటు బైక్లను కూడా కొనుగోలు చేయవచ్చు.

  కేవలం 40 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్..

  గ్లైడ్ ప్లస్ ఎలక్ట్రిక్ వాహనం 2.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అయితే, ఇది అత్యధికంగా 60 కిలోమీటర్ల స్పీడ్ను మాత్రమే చేరుకోగలదు. ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సిబిఎస్లతో అందుబాటులో ఉంటాయి. ఇక, ఎవాల్వ్ Z ఎలక్ట్రిక్ బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది అత్యధికంగా 95 కి.మీ స్సీడ్ను చేరుకోగలదు. ఎవాల్వ్ Rలో కూడా ఎవాల్వ్ Z మాదిరిగానే ఒకేరకమైన స్పెసిఫికేషన్లు ఉంటాయి. ఈ వాహనాలు కేవలం 40 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో ఛార్జ్ అవుతాయి.

  EV మార్కెట్లో 10 శాతం వాటా లక్ష్యంగా..

  ఈ వాహనాలన్నింటిలో ఉత్తమ బ్యాటరీని అమర్చామని కంపెనీ పేర్కొంది. అంతేకాక, దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. సర్వీసింగ్ విషయానికి వస్తే మొదటి ఏడాది రెండుసార్లు, తరువాత ఏడాదికి ఒకసారి సర్వీసింగ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. సాంప్రదాయిక పెట్రోల్ వాహనాలకు అయ్యే సర్వీసింగ్ ఖర్చు కంటే వీటి సర్వీసింగ్కు 30 శాతం తక్కువగానే ఖర్చవుతుందని తెలిపింది. కాగా, ఈ స్టార్టప్ కంపెనీ భారత EV మార్కెట్లో 10 శాతం వాటా దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది చివరి నాటికి సుమారు 12,000 EV లను విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మూడు వాహనాలకు టిఎఫ్‌టి డాష్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ డయల్ వంటి ఫీచర్లను కూడా చేర్చింది. సమీప భవిష్యత్తులో ఈ మూడు వాహనాల్లో OTA అప్డేట్ను కూడా అందించనుంది. ఇక రెండవ త్రైమాసికం పూర్తయ్యే నాటికి మరో కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికిల్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

  First published:

  Tags: Bikes, Electric Bikes, Electric Vehicle

  ఉత్తమ కథలు