హోమ్ /వార్తలు /బిజినెస్ /

Social Media Guidelines: తప్పుడు సోషల్‌ మీడియా ప్రమోషన్లు చేస్తే భారీ జరిమానా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్త గైడ్ లైన్స్..!

Social Media Guidelines: తప్పుడు సోషల్‌ మీడియా ప్రమోషన్లు చేస్తే భారీ జరిమానా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్త గైడ్ లైన్స్..!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Social Media Guidelines: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పుదారి పట్టించే సమాచారం లేదా నకిలీ రివ్యూలను షేర్ చేస్తున్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా గైడ్‌లైన్స్‌ పేర్కొంటున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)ను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో తప్పుడు సమాచారం కూడా ప్రచారం అవుతోంది. అందుకే సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, తప్పుదారి పట్టించే ప్రమోషన్‌(Misleading Promotions)లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వీటికి సంబంధించి త్వరలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు (Influencers) ఇప్పుడు సోషల్ మీడియాలో ఏవైనా ప్రొడక్టులు, బ్రాండ్‌లు, సేవలను ప్రమోట్ చేయాలంటే, వారికి సదరు సంస్థతో ఉన్న సంబంధాన్ని వెల్లడించాలని, డిస్‌క్లైమర్‌లను ఉంచాలని, అందుతున్న ఆర్థిక ప్రయోజనాలను బహిర్గతం చేయాలని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త మార్గదర్శకాలపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల రెస్పాన్స్ ఏంటో తెలుసుకుందాం.

* తప్పుడు ప్రచారాలకు భారీ జరిమానా

ఇకపై తప్పుదారి పట్టించే సమాచారం లేదా నకిలీ రివ్యూలను షేర్ చేస్తున్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొదటి నేరానికి గరిష్టంగా రూ.10 లక్షలు, నేరాలు రిపీట్‌ అయితే రూ.50 లక్షల వరకు జరిమానా పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ మార్గదర్శకాలను కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు సపోర్ట్‌ చేస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.

* తక్కువ సంపాదించే క్రియేటర్స్‌పై ప్రభావం

కేంద్రం తీసుకొస్తున్న మార్గదర్శకాలు మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై లేదా 1,000 నుంచి లక్ష మంది ఫాలోవర్స్‌ ఉన్నవారిపై ప్రభావం చూపుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. తక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్నవారు చాలా తక్కువ సంపాదిస్తారు కాబట్టి, వారిపై అదే భారీ జరిమానా విధించడం సరికాదని కొందరు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు.

* ఇద్దరినీ బాధ్యులను చేయాలి

ఈ విషయంపై హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడారు డిజిటల్ క్రియేటర్ ఇషా రాథోడ్. తాజా మార్గదర్శకాలు తీసుకురావడానికి గల ఉద్దేశాలను ఆమె సపోర్ట్‌ చేశారు. ఇలాంటి కఠిన నిబంధనలు, బ్రాండ్స్‌కు ప్రమోషన్‌ చేసే ముందు సంబంధిత కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేలా చేస్తాయని తెలిపారు. అయితే క్యాంపెయిన్‌ సైజ్‌, సంపాదిస్తున్న మనీ ఆధారంగా జరిమానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

క్రియేటర్‌లు, బ్రాండ్‌లు రెండూ కలిసి ప్రమోషన్లు చేస్తాయని, కేవలం ఇన్‌ఫ్లూయెన్సర్లను మాత్రమే బాధ్యులను చేయకూడదని చాలా మంది భావిస్తున్నారు. విక్రయాలను పెంచుకోవడానికి, పెయిర్‌ పార్ట్‌నర్‌షిప్‌లను కోరుకుంటారని, అలాంటప్పుడు పెయిడ్‌ అడ్వెర్టైజ్‌మెంట్‌ అని ఫాలోవర్లకు చెప్పడానికి క్రియేటర్స్‌ ఇష్టపడరని డిజిటల్ క్రియేటర్‌ ఉదిత మంగ్లా చెప్పారు. ఈ విషయంపై హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, క్రియేటర్స్‌ను, ఒప్పందం చేసుకునే కంపెనీలను బాధ్యులను చేయాలని కోరారు. ఇద్దరికీ జరిమానా విధించడం ద్వారా బ్రాండ్‌లు కూడా బాధ్యతాయుతంగా ఉంటాయని పేర్కొన్నారు.

* నైతిక బాధ్యత

ట్రస్టెడ్‌ కమ్యూనిటీని డెవలప్‌ చేయడానికి ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని ఉదిత మంగ్లా పేర్కొన్నారు. వ్యాపారాలు, బ్రాండ్‌లను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రమోషన్స్‌, కంటెంట్‌ అడ్వెర్టైజ్‌మెంట్‌ అని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేడయం నైతిక బాధ్యగా చెప్పారు. ఈ పనులను బ్రాండ్‌కి పేమెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ రిక్వెస్ట్‌ పంపడం, క్యాప్షన్‌లో #ad వంటి హ్యాష్‌ట్యాగ్‌లను చేర్చడం ద్వారా చేయవచ్చని పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Facebook, Instagram, Social Media, Twitter, Youtube

ఉత్తమ కథలు