A NEW MESSENGER IS AVAILABLE FROM PAYTM MONEY TO GUIDE PEOPLE TO INVEST AND TRACK STOCK MARKETS PRV GH
Paytm:పేటీఎం నుంచి ఏఐ మెసెంజర్ లాంచ్.. ఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలో చెప్పే కొత్త టూల్
ప్రతీకాత్మక చిత్రం
మీరు స్టాక్ మార్కెట్ (Stock market) లోకి కొత్తగా వచ్చారా? ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ (Invest) చేయాలో తెలియకుండా ఉందా? అయితే మీలాంటి వారికి మార్గనిర్దేశం చేసేందుకు పేటీఎం మనీ నుంచి ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
మీరు స్టాక్ మార్కెట్ (Stock market) లోకి కొత్తగా వచ్చారా? ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ (Invest) చేయాలో తెలియకుండా ఉందా? అయితే మీలాంటి వారికి మార్గనిర్దేశం చేసేందుకు పేటీఎం మనీ (Paytm money) నుంచి ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) నడిచే పాప్స్ (Pops) మెసెంజర్ (Messenger). స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ మెసెంజర్‌ను రూపొందించనట్లు పేటీఎం తన ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ల సమాచారంతో పాటు ఎటువంటి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయి. ఎటువంటి వాటి షేర్లకు దూరంగా ఉండాలో కూడా తెలుసుకోవచ్చు.
ఇన్నోవేటివ్‌గా ఆలోచించే పేటీఎం..
దేశంలో స్టాక్ మార్కెట్ (Stock Market)ఇన్వెస్టర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ తీయడంతో దేశంలోని యువత తమ డబ్బును షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో దేశంలో మార్కెట్ బ్రోకరేజి సంస్థలు చాలానే ఉన్నాయి. అందులో పేటీఎం మనీ కూడా ఒకటి. ఎప్పుడూ ఇన్నోవేటివ్‌గా ఆలోచించే (Innovative thinking) పేటీఎం... పాప్స్ మెసెంజర్‌తో తమ కస్టమర్లను షేర్స్ విషయంలో గైడ్ చేసేందుకు ముందుకొచ్చింది.
స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు..
ఈ మెసెంజర్ ద్వారా తమ షేర్లకు సంబంధిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని ఇన్వెస్టర్లు పొందవచ్చు. పూర్తి ఏఐ ఇంటర్ఫేస్తో నడిచే ఈ మెసెంజర్ స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు పూర్తి సమాచారాన్ని... చాలా క్లుప్తంగా ఇస్తుంది. అంతేకాకుండా మార్కెట్ల అనాలిసిస్‌ను, పోర్ట్‌పోలియోను ఏ విధంగా విభజించుకోవాలో కూడా చెబుతుంది. వీటితో పాటు ఏ సెక్టార్ విపరీతమైన లాభాలను తీసుకొస్తాయి... వేటికి దూరంగా ఉండాలో కూడా తమ కస్టమర్లను హెచ్చరిస్తుంది.
ఇందుకోసం పేటీఎం మనీ ఇన్వెస్టర్ అలీ, డెయిలీ బ్రీఫ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్వెస్టర్ అలీ సాయంతో తమ కస్టమర్లకు స్టాక్స్‌ను రికమెండ్ చేస్తుంది. ఏ స్టాక్స్‌లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి... ఎప్పుడు ఎగ్జిట్ నిర్ణయం తీసుకోవాలి అనే విషయాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. డెయిలీ బ్రీఫ్ సాయంతో మార్కెట్ల రోజు వారి సమాచారాన్ని మార్కెట్లు క్లోజ్ అవ్వగానే క్లుప్తంగా తమ యూజర్లకు సందేశాల రూపంలో పంపుతుంది. అంతేకాకుండా ఆ రోజు ఏ షేర్లు బాగా పర్ఫామ్ చేశాయి... ఏవి నేల చూపులు చూశాయి అనే విషయాలను కూడా తమ కస్టమర్లకు తెలిజయేస్తుంది.
‘మా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు మేం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. అందుకోసం ఎప్పటికప్పడు సరికొత్త ఆలోచనలతో, ఇన్నోవేషన్స్‌తో మా కస్టమర్ల ముందుంటాం. ఇప్పుడు కూడా మా కస్టమర్ల ఇన్వెస్ట్మెంట్ సజావుగా సాగడం కోసం పాప్స్ అనే ఆర్టిఫిషియల్ మెసెంజర్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా మార్కెట్ల గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. అంతేకాకుండా పేటిఎం మనీ ద్వారా షేర్లలో ఇన్వెస్ట్ చేసిన మా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సమర్థవంతగా నిర్వహించుకోవచ్చు. ఇందులో భాగంగా ఉన్న ఇన్వెస్టర్ అలీ, డెయిలీ బ్రీఫ్లకు కృతజ్ఞతలు’ అని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ వ్యాఖ్యానించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.